Share News

Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..

ABN , Publish Date - Mar 27 , 2025 | 07:01 PM

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..కేటీఆర్‌పై ఫన్నీ కామెంట్లు చేశారు. నేపాల్‌ యువరాజు దేపేంద్ర సంఘటనను గుర్త చేస్తూ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. కేటీఆర్ ఇంగ్లీష్ పరిజ్ణానం గురించి క్లాస్ పీకారు.

Revanth Reddy: డిన్నర్‌కి పిలిచి AK47తో లేపేశాడు.. కేటీఆర్‌పై సీఎం సెటైర్లు..
Revanth Reddy

అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ల మధ్య మాటల యుద్దం నడిచింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ కేటీఆర్ మండిపడ్డారు. కేటీఆర్ కామెంట్లపై సీఎం రేవంత్ సెటైరికల్‌గా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ‘ ఇంగ్లీష్ ముక్కలు ఆయనకు రావచ్చు. ఈ ప్రపంచంలో చైనాలో ఉండేవారికి ఇంగ్లీష్ రాదు. జపాన్‌లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. జర్మన్‌లో ఉండేవాడికి ఇంగ్లీష్ రాదు. చైనా, జపాన్, జర్మన్‌లు ప్రపంచాన్ని శాసిస్తున్నాయి. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు వస్తే.. హోటల్‌లో పని చేయడానికి.. ఆర్డర్‌లు తీసుకోవడానికి పనికొస్తుంది. బట్టల షాపులో బట్టలు అమ్మడానికి పనికొస్తుండొచ్చు.


గుంటూరులో చదివిన తెలివితేటలన్నీ మా దగ్గర వచ్చి చూపించొద్దు. మేము గవర్నమెంట్ స్కూల్లో చదివాము. మేం గుంటూరులో చదవలేదు. మాది తెలుగు మీడియం. మేము గుంటూరులో చదవలేదు. పూణే పోలేదు. విదేశాల్లో తిరగడానికి పోలేదు. మేము ఇక్కడే పుట్టినం, ఇక్కడే పెరిగినం, ఇక్కడే చదువుకున్నాం. లోకల్ పరిజ్ణానం తోటి పని చేస్తున్నాం. మేము ప్రజల బాధతెలిసిన వాళ్లం. రైతు బిడ్డను, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాడ్ని..నేను ముఖ్యమంత్రి అయితే మీకెందుకు కడుపుమంట. నేను ఇక్కడ కనిపించగానే కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఈ ఐదేళ్లు మాత్రమే కాదు.. వచ్చే ఐదేళ్లు కూడా మేమే అధికారంలో ఉంటాం. పెద్దాయన మీకు కుర్చీ ఇవ్వడు.


ఆయన గురించి మీకు ఎంత తెలుసో కానీ, నాకు చాలా తెలుసు. నీకు కూడా చెప్పా ఏమీ ఆశించకు అని.. ఎందుకు మీరు ఆయన మీద పగబట్టారు. కుటుంబంలో పెద్ద దిక్కు ఉండాలి అప్పుడే గౌరవం ఉంటది. పెద్దాయన్ని కూడా ఖతం చేసి,సీటులో కూర్చోవాలనే స్కీములు వేయకండి. గతంలో నేపాల్‌ యువరాజు దేపేంద్ర.. పదవి ఇవ్వలేదని కుటుంబంలోని 8 మందిని కాల్చి చంపాడు. డిన్నర్‌కు పిలిచి ఇంట్లో వాళ్లందర్నీ ఏకే 47తో కాల్చిపడేశాడు. అట్లాంటి పరిస్థితులు తెలంగాణలో రాకుండా చూడండి అధ్యక్షా.. ’ అంటూ కేటీఆర్‌పై సెటైర్లు వేశారు.


ఇవి కూడా చదవండి:

గ్రౌండులో SRH

KTR: అలా అయితే రాజకీయాలకు గుడ్ బై

Bhuma Akhila Priya: సాక్షి ఆఫీసు వద్ద భూమా అఖిలప్రియ ధర్నా

Updated Date - Mar 27 , 2025 | 07:02 PM