Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అమ్మేసిన కుటుంబ సభ్యులు.. టీనేజర్ ఆత్మహత్య
ABN , Publish Date - Jan 14 , 2025 | 10:25 PM
ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుటుంబసభ్యులు తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అమ్మేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓ టీనేజర్ చివరకు తన ప్రాణాలను తానే తీసుకున్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. కుటుంబసభ్యులు తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అమ్మేయడంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ఓ టీనేజర్ చివరకు తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. మీరట్‌లో ఈ దారుణం వెలుగు చూసింది (Viral).
స్థానిక మీడియా కథనాల ప్రకారం, సదరు టీనేజర్ 9వ తరగతి చదువుతున్నాడు. అతడు తన రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌పై నిత్యం చక్కర్లు కొడుతూ సమయం వృథా చేయడంతో తల్లి, అన్న ఆవేదన చెందారు. టీనేజర్‌కు ఎంత చెప్పినా అతడు తన తీరు మార్చుకోలేదు. అతడి భవిష్యత్తు నాశనమైపోతోందని కలత చెందిన వారు చివరకు బైక్‌ను అమ్మేశారు. దీంతో, బాలుడు తీవ్ర అసహనానికి లోనయ్యాడు.
Viral: ఆటో డ్రైవర్‌ను పబ్లిక్‌గా చెంపలు వాయించిన యువతి.. షాకింగ్ వీడియో
ఈ క్రమంలో జనవరి 11న బాలుడి అన్న తన తల్లిని యూనివర్సిటీ నుంచి ఇంటికి తీసుకొచ్చేందుకు వెళ్లాడు. ఆ సమయంలో ఒంటరిగా ఉన్న బాలుడు నాటు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లి, అన్న ఇంటికొచ్చి తలుపులు తెరవమని కోరుతున్న సమయంలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఇంట్లో పెద్ద శబ్దం రావడంతో తలుపులు బలవంతంగా తెరిచి లోపలికెళ్లిన వాళ్లకు టీనేజర్ రక్తం మడుగులో అచేతనంగా కనిపించాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. టీనేజర్ తండ్రి గతేడాదే మృతిచెందాడని, అన్న ప్రస్తుతం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.
Viral: వామ్మో.. వాడకం అంటే ఇదే.. విద్యుత్ కారు బ్యాటరీని ఎలా వాడేస్తున్నాడో చూస్తే..
కాగా, మరో ఘటనలో బారా బంకీకి చెందిన ఓ వ్యక్తి తనను భార్య కుటుంబసభ్యులు వేధిస్తున్నారంటూ లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. తన సూసైడ్ నోట్ పక్కన తమ పెళ్లి ఫోటో, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌ను కూడా పెట్టాడు. పెళ్లికి ముందు తాము నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నామని, తన బంధానికి యువతి సోదరుడి ఆమోదం కూడా ఉన్నా ఇతర కుటుంబసభ్యులు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయాడు.