Share News

Viral Video: వావ్.. ఎలన్ మస్క్‌కు పోటీ ఇచ్చేలా ఉన్నాడు కదా.. నీటి మీద వేగంగా వెళ్తున్న ఈ వాహనాన్ని చూశారా?

ABN , Publish Date - Jan 07 , 2025 | 08:56 AM

సోషల్ మీడియాలో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ వీడియోల్లోని వ్యక్తుల ప్రతిభ మహామహులకు ఏ మాత్రం తీసిపోదు. ఎంతో మంది అబ్చురపరిచే ట్యాలెంట్‌ను కలిగి ఉంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: వావ్.. ఎలన్ మస్క్‌కు పోటీ ఇచ్చేలా ఉన్నాడు కదా.. నీటి మీద వేగంగా వెళ్తున్న ఈ వాహనాన్ని చూశారా?
Speed boat like space X plane

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని వీడియోలను చూస్తే ఆశ్చర్యపోవడం ఖాయం. ఆ వీడియోల్లోని వ్యక్తుల ప్రతిభ మహామహులకు ఏ మాత్రం తీసిపోదు. ఎంతో మంది అబ్చురపరిచే ట్యాలెంట్‌ (Talent)ను కలిగి ఉంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి స్పేస్ ఎక్స్‌ (Space X)ను తలపించే ఓ స్పీడ్ బోట్‌ను డిజైన్ చేశాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


theindiansarcasm అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. నది ఒడ్డున ఓ వ్యక్తి కూర్చున్నాడు. అంతరిక్ష విమానంలా ఉన్న స్పీడ్ బోట్‌ (Speed Boat)ను ఒడ్డుకు లాగుతున్నాడు. ఆ బోట్ ఒడ్డు దగ్గరకు చేరుకున్న తర్వాత దాని తలుపులు ఆటోమేటిక్‌గా తెరుచుకున్నాయి. ఆ తర్వాత ఆ కుర్రాడు దానిలోకి ఎక్కి కూర్చున్నాడు. ఆ స్పీడ్ లోపలి భాగం ఓ రాకెట్‌ను తలపిస్తోంది. దానిలో ఆ కుర్రాడు రకరకాల సెన్సార్లను అమర్చినట్టు అర్థమవుతోంది. డ్రైవింగ్ కోసం లోపల స్టీరింగ్ వీల్ కూడా ఉంది. ఆ స్పీడ్ బోట్ నీటిలో చాలా వేగంగా ముందుకు దూసుకుపోతోంది.


ఆ అద్భుతమైన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఎలన్ మస్క్‌ కంపెనీని ప్రమాదంలోకి నెట్టేశాడు``, ``అద్భుతమైన ట్యాలెంట్ బ్రదర్``, ``వావ్.. రాకెట్‌లా ఉంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వామ్మో.. ఇలాంటి వాళ్లు మన దేశంలోనే ఉన్నారా? బైక్‌ను ఏటీఎమ్ మెషిన్‌లో ఎలా మార్చాడో చూడండి..


Brain Teaser Test: మీ బ్రెయిన్ షార్ప్ అయితే.. ఈ ఫొటోలో మూడు తప్పులను 9 సెకెన్లలో గుర్తించండి..


Viral: వావ్.. చిన్న స్థలంలో అంత పెద్ద ఇల్లా? ఆ ప్లానింగ్ ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..


Optical Illusion Test: మీది హె‌చ్‌డీ చూపు అయితే.. ఈ నాలుగింటిలో భిన్నమైన చేపను 5 సెకెన్లలో గుర్తించండి..


Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 07 , 2025 | 08:56 AM