Viral Video: వామ్మో.. ఇలాంటి వాళ్లు మన దేశంలోనే ఉన్నారా? బైక్‌ను ఏటీఎమ్ మెషిన్‌లో ఎలా మార్చాడో చూడండి..
ABN , Publish Date - Jan 07 , 2025 | 08:18 AM
ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే సాధారణ వ్యక్తులు కూడా ఎంత గొప్పగా ఆలోచించగలరో అర్థం అవుతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బైక్ హ్యండిల్‌లో ఏటీఎమ్ మెషిన్ సెట్ చేశాడు.
మనదేశంలోని సామాన్యులు కూడా అసమానమైన తెలివితేటలను (Intelligence) ప్రదర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి ప్రతిభ అందరికీ తెలుస్తోంది. ప్రతిరోజు కొన్ని వందల వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతున్నాయి. ఆ వీడియోలు చూస్తే సాధారణ వ్యక్తులు కూడా ఎంత గొప్పగా ఆలోచించగలరో అర్థం అవుతోంది. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ వ్యక్తి బైక్ (Bike) హ్యండిల్‌లో ఏటీఎమ్ మెషిన్ సెట్ చేశాడు. దానిని మొబైల్ కూల్ డ్రింక్ షాప్‌గా మార్చాడు (Bike ATM Machine Video Viral).
sirswal.sanjay అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి ఖాళీగా ఉన్న రోడ్డు మీద బైక్ ఆపి దాని ముందు నిల్చున్నాడు. మొదట తన బైక్ హెడ్‌లైట్‌లో డెబిట్ కార్డ్‌ను ఇన్‌సర్ట్ చేశాడు. ఆ తర్వాత హెడ్‌లైట్ పైన ఉన్న నంబర్ బటన్‌లను నొక్కాడు. ఆ తర్వాత, అతను హెడ్‌లైట్ ముందు ఒక గ్లాస్‌ను పెడితే హెడ్‌లైట్ లోపలి నుంచి పైప్ ద్వారా కూల్‌డ్రింక్ ఆ గ్లాసులో పడుతోంది. ఈ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 30 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. మూడు లక్షలు కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``భారతదేశం తెలివైన వారితో నిండిపోయింది``, ``సోదరా అంత ట్యాలెంట్ ఎక్కడది``, ``ఈ టెక్నిక్ భారతదేశం బయటకు వెళ్లకూడదు``, ``ఇది నిజమేనా`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: భారతీయులకే ఇలాంటి టెక్నిక్ సాధ్యం.. బ్లాంకెట్‌కు కవర్ ఎలా తొడిగిందో చూడండి..
Viral Video: వామ్మో.. ఏనుగులకు కోపం వస్తే ఇలా ఉంటుందా? ఎలా దాడి చేస్తున్నాయో చూడండి..
Viral: వావ్.. చిన్న స్థలంలో అంత పెద్ద ఇల్లా? ఆ ప్లానింగ్ ఇచ్చిన వారికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి