Viral News: కారు డ్రైవర్‌తో లొల్లి..రోడ్డు మధ్యలో నిలబడి ట్రాఫిక్ అడ్డుకున్న బైకర్
ABN , Publish Date - Mar 21 , 2025 | 03:47 PM
రోడ్లపై ప్రయాణించే సమయంలో అప్పుడప్పుడు పక్క వాహనాలు తాకుతుండటం లేదా ఆ వాహన డ్రైవర్లతో గొడవలు జరుగుతుంటాయి. ఆ క్రమంలో గొడవ పెరగడం లేదా పట్టించుకోకుండా వెళ్లడం జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం ఓ బైకర్ వినూత్నంగా నిరసన తెలిపి వార్తల్లో నిలిచారు.

అప్పుడప్పుడు రోడ్లపై ప్రయాణిస్తున్న క్రమంలో పక్క వాహనదారులు బైకులతో లేదా పలు రకాల వాహనాలతో అనుకోకుండా ఇతర వాహనాలకు తాకిస్తారు. ఆ క్రమంలో పెద్దగా నష్టం కలుగకుంటే అనేక మంది పట్టించుకోకుండా పోతారు. కానీ వారి వాహనాలకు ఏదైనా జరిగితే మాత్రం ఊరుకోరు, అక్కడే ఆగిపోయి రోడ్డుపైనే రచ్చ రచ్చ చేస్తారు. తాజాగా ఇప్పుడు కూడా అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చింది.
ఎదురుగా నిలబడి..
వీడియోలో ఒక బైకర్, కారు డ్రైవర్‌తో వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలో బైకర్ రోడ్డుపై ట్రాఫిక్ సిగ్నల్ పడిన క్రమంలో కారుకు ఎదురుగా నిలబడి నిరసన తెలిపాడు. ఆ తర్వాత గ్రీన్ సిగ్నల్ పడిన తర్వాత కూడా ఆ కారుకు దారి ఇవ్వలేదు. దీంతో ఆ ప్రాంతంలో కొద్ది సేపు ట్రాఫిక్ జాం పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
నెటిజన్ల కామెంట్లు
వీడియో ప్రకారం చూస్తే ఒక ద్విచక్ర వాహనదారుడు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వేచి ఉన్న కారు ముందుకు బలవంతంగా దూసుకెళ్లే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన అనేక మంది బెంగళూరులో బైకర్ల ప్రవర్తనపై పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. చాలామంది నెటిజన్లు ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని, బైకర్ ప్రవర్తనను తీవ్రంగా విమర్శించారు. రోడ్డు మధ్యలో నిలబడటం ఎంత వరకు సబబని, రహదారిలో వారికి ఇలాంటి హక్కులు కూడా ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు.
శాంతియుతంగా ప్రవర్తించాలని
ఈ వీడియో చూసిన మరికొంత మంది గ్రీన్ సిగ్నల్ పడినప్పుడు, అతను వెనక్కి రావాల్సిందని అంటున్నారు. మరొకరైతే, ఇలాంటి ప్రవర్తన ప్రజల మానవ హక్కులను భంగపరిచే ప్రమాదాన్ని కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతోపాటు ఆయా వాహన డ్రైవర్లు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఇలాంటి ఘటనల విషయంలో ప్రతి ఒక్కరు కూడా శాంతియుతంగా ప్రవర్తించాలని ఇంకొంత మంది సూచిస్తున్నారు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు కూడా ఓసారి చూసేయండి మరి.
ఇవి కూడా చదవండి:
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News