Share News

Viral: ట్రంప్ ప్రమాణస్వీకారం.. జో బైడెన్ రియాక్షన్ వైరల్

ABN , Publish Date - Jan 21 , 2025 | 08:16 PM

డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ముందు జో బైడెన్ క్షణకాలం పాటు దేవుడిని ప్రార్థించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక అమెరికాను దేవుడే కాపాడాలన్నట్టు ఆయన ప్రార్థన ఉందని జనాలు కామెంట్‌ల వర్షం కురిపిస్తున్నారు.

Viral: ట్రంప్ ప్రమాణస్వీకారం.. జో బైడెన్ రియాక్షన్ వైరల్

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణస్వీకారం జనవరి 20న అట్టహాసంగా సాగింది. సతీసమేతంగా మాజీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అమెరికా వ్యాపారదిగ్గజాలు, వివిధ రంగాల అతిరథ మహారథుల సమక్షంలో ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. అయితే, గతేడాది జరిగిన ఎన్నికల్లో ట్రంప్ విజయం అనేక మందిని ఆశ్చర్యపరిచిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎలక్టోరల్ ఓట్లతో పాటు ప్రజాఓటును కూడా ట్రంప్ గంపగుత్తగా ఎగరేసుకుపోయారు. ట్రంప్ ప్రత్యర్థులకు ఈ ఫలితం ఆశ్చర్యాన్ని మిగిల్చింది . ఈ నేపథ్యంలో ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా పలు ఆసక్తికర పరిణమాలు సొంతం చేసుకున్నాయి (Viral).


Viral: మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.. వారానికి 70 పని గంటలపై ఇన్ఫీ నారాయణమూర్తి కీలక వ్యాఖ్య

ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ సెనెటర్ క్లోబుచార్ తొలుత ఆహుతులను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం, ట్రంప్ వేదిక మీదకు వస్తుండగా అక్కడి వారందరూ కరతాళధ్వనులతో శుభాకాంక్షలు తెలిపారు. జో బైడన్ కూడా చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. ఆ మరుక్షణమే దేవుడిని ప్రార్థించి మళ్లీ యథావిథిగా చప్పట్లో చరిచారు.

Viral: తొలిసారిగా భారతీయ రైలు ఎక్కిన డచ్ మహిళ! పక్క సీటులోని ప్రయాణికుడు చేసిన పనికి..

అయితే, ట్రంప్ ప్రమాణస్వీకారానికి సరిగ్గా కొన్ని క్షణాల ముందు బైడెన్ ఇలా దేవుడిని ప్రార్థించడంపై నెట్టింట రకరకాల కామెంట్స్ వినపడుతున్నాయి. అనేక మంది వీడియో చూసి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇక అమెరికాను నువ్వే కాపాడాలంటూ పైవాడిని బైడెన్ ప్రార్థిస్తున్నట్టు ఉందని కామెంట్ చేశారు. ఇక అమెరికాను దేవుడే కాపాడాలంటూ మరికొందరు అభిప్రాయపడ్డాడు. ‘‘జో చేసిందే కరెక్టే.. మనందరం అమెరికా కోసం దేవుడిని ప్రార్థించాలి’’ అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు.


Viral: స్కూల్ రోజుల్లో నాటకంలో భార్యాభర్తలుగా నటించి.. 20 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..

ఈ నేపథ్యంలో హిల్లరీ క్లింటర్ రియాక్షన్ కూడా వైరల్‌గా మారింది. ప్రమాణస్వీకారం తరువాత ట్రంప్ తొలిసారిగా ప్రసంగిస్తూ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మారుస్తానని గర్వంగా ప్రకటించారు. ఇది విన్న వెంటనే హిల్లరీ క్లింటన్ భళ్లున నవ్వేశారు. కెమెరాలు తమను చూస్తున్నాయన్న తెలిసీ ఆమె నవ్వును ఆపుకోలేకపోయారు. ఈ దృశ్యాలు కూడా నెట్టింట బాట పట్టడంతో జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

Viral: గంటకు 282 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలుకు వేళాడుతూ ప్రయాణం! తృటిలో తప్పిన ప్రమాదం!

Read Latest and Viral News

Updated Date - Jan 21 , 2025 | 08:18 PM