Viral News: ఏడడుగులు వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..
ABN , Publish Date - Jan 05 , 2025 | 04:01 PM
బంధుమిత్రలందరూ వేదిక ముందు ఆశీనులై ఉన్నారు.. పెళ్లి తంతు జరుగుతోంది.. వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం మొదలుకాబోతుంది.. ఆ సమయంలో వధువు అర్జెంట్ అని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లింది.. ఎంతకీ తిరిగి రాలేదు.. అనుమానం వచ్చి వధువు కోసం వెళ్లిన వారికి షాక్..
ఉత్తరప్రదేశ్ (UttarPradesh)లోని గోరఖ్‌పూర్‌లోని భరోహియాలోని శివాలయం.. అంగరంగ వైభవంగా వివాహం (Wedding) కార్యక్రమం జరుగుతోంది.. బంధుమిత్రలందరూ వేదిక ముందు ఆశీనులై ఉన్నారు.. పెళ్లి తంతు జరుగుతోంది.. వధూవరులు ఏడడుగులు వేసే కార్యక్రమం మొదలుకాబోతుంది.. ఆ సమయంలో వధువు (Bride) అర్జెంట్ అని చెప్పి వాష్‌రూమ్‌కు వెళ్లింది.. ఎంతకీ తిరిగి రాలేదు.. అనుమానం వచ్చి వధువు కోసం వెళ్లిన వారికి షాక్.. వధువు ఎక్కడా కనిపించలేదు.. దీంతో వరుడు తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమన్నాడు (Cheating Bride).
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని భరోహియా ప్రాంతానికి చెందిన కమలేష్ కుమార్‌కు 40 ఏళ్లు. మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఎవ్వరూ అతడిని పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు. దీంతో మధ్యవర్తికి రూ.30 వేలు కమిషన్ ఇచ్చి ఓ అమ్మాయితో పెళ్లి కుదుర్చుకున్నాడు. పెళ్లికి ముందే ఆ అమ్మాయికి భారీగా నగలు, పట్టు చీరలు కొన్నాడు. పెళ్లి ఖర్చులు కూడా తానే భరిస్తానని మాటిచ్చాడు. శుక్రవారం పెళ్లి తంతు మొదలైంది. వధువు తన తల్లితో కలిసి ఆలయానికి రాగా.. కమలేష్ తన కుటుంబంతో అక్కడకు చేరుకున్నాడు.
పెళ్లి ఆచారాలు ప్రారంభమైన తరువాత వధువు బాత్రూమ్‌కు వెళ్లి తిరిగి రాలేదు. మండపంలోనే ఉండాల్సిన వధువు తల్లి కూడా బంగారం, బట్టలు తీసుకుని అదృశ్యమైంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదూ అందలేదని, ఎవరైనా కంప్లైంట్ చేస్తే చర్యలు తీసుకుంటామని స్థానిక ఏఎస్పీ జితేంద్ర కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: అమ్మా.. వస్తున్నా ఆగు.. తల్లిపై సింహం పిల్ల ఎలా కోపం ప్రదర్శిస్తోందో చూడండి..
Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..
Viral Video: వీళ్లు అసలు మనుషులు కాదు.. అడవిలోకి వెళ్లి పులితో ఎలా ప్రవర్తించారో చూడండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి