Share News

Panipuri Vendor: వామ్మో.. పానీపూరీ అమ్ముతూ అంత సంపాదిస్తున్నాడా? అతడి ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలియ్యాల్సిందే..

ABN , Publish Date - Jan 05 , 2025 | 03:30 PM

తమిళనాడులోని పానీపూరీలు అమ్ముకునే వ్యక్తి సంపాదన చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే. తాజాగా అతడికి జీఎస్టీ నోటీస్ వచ్చే వరకు అతడి సంపాదన గురించి ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. సాధారణంగా రోడ్డు పక్కన స్టాల్స్‌లో చేసుకునే వ్యాపారాలు జీఎస్టీ పరిధిలోకి రావు. కానీ, ఆ పానీపూరీ వాలా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చూస్తే నివ్వెరపోవాల్సిందే.

Panipuri Vendor: వామ్మో.. పానీపూరీ అమ్ముతూ అంత సంపాదిస్తున్నాడా? అతడి ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలియ్యాల్సిందే..
GST notice to panipuri vendor

సాధారణంగా రోడ్డు పక్కన స్టాల్ పెట్టుకుని అమ్ముకునే పానీపూరీ వ్యాపారుల (Panipuri Vendors) సంపాదన చాలా తక్కువగా ఉంటుందనుకుంటాం. ఒకవేళ ఆదాయం బాగున్నా మహా అయితే నెలకు రూ.70, 80 వేల సంపాదిస్తాడేమో అనుకుంటాం. అయితే తమిళనాడు (TamilNadu)లోని పానీపూరీలు అమ్ముకునే వ్యక్తి సంపాదన చూస్తే కళ్లు తేలెయ్యాల్సిందే. తాజాగా అతడికి జీఎస్టీ నోటీస్ (GST Notice) వచ్చే వరకు అతడి సంపాదన గురించి ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు. సాధారణంగా రోడ్డు పక్కన స్టాల్స్‌లో చేసుకునే వ్యాపారాలు జీఎస్టీ పరిధిలోకి రావు. కానీ, ఆ పానీపూరీ వాలా ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ చూస్తే నివ్వెరపోవాల్సిందే (GST notice to panipuri vendor).


జీఎస్టీ నిబంధనల ప్రకారం రూ. 20 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తున్న వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతి యేటా పన్ను చెల్లించాలి. కానీ, రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకుంటున్న వారి ఆదాయం ఎంత ఉంటుందో ఎవరూ కనిపెట్టలేరు. కానీ, యూపీఐ ద్వారా డబ్బులు చెల్లిస్తే అతడి సంపాదనపై కొంత వరకు అవగాహన వస్తుంది. తమిళనాడులో పానీపూరీ అమ్ముకునే ఆ వ్యక్తికి 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.40 లక్షలు ఆదాయం వచ్చిందట. అంటే అతడికి యూపీఐ ద్వారా వచ్చిన చెల్లింపులు రూ.40 లక్షలు. ఇక, నగదు రూపంలో అతడికి ఎంత ఆదాయం వచ్చిందో చూసుకుంటే అతడు ఏడాదికి కనీసం రూ.60 నుంచి 70 లక్షలు సంపాదిస్తున్నాడన్నమాట.


యూపీఐ ద్వారా అతడి ఆదాయ వివరాలు తెలుసుకున్న జీఎస్టీ అధికారులు అతడికి నోటీసులు పంపించారు. పన్ను కట్టాలని పేర్కొంటూ నోటీస్ పంపారు. అలాగే వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అలా చేయడంలో విఫలమైతే GST చట్టం, 2017లోని సెక్షన్ 23లోని సబ్-సెక్షన్ (2) ప్రకారం జరిమానా విధిస్తామని నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి, మీరు కూడా ఏటా జీఎస్‌టికి నమోదు చేసుకోవాలని వ్యాపారికి అధికారులు చెప్పారు. 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలకు సంబంధించిన లావాదేవీ ఖాతా పత్రాలను జీఎస్టీ అధికారులకు సమర్పించాలని ఆదేశించారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: అమ్మా.. వస్తున్నా ఆగు.. తల్లిపై సింహం పిల్ల ఎలా కోపం ప్రదర్శిస్తోందో చూడండి..


Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..

Viral Video: వీళ్లు అసలు మనుషులు కాదు.. అడవిలోకి వెళ్లి పులితో ఎలా ప్రవర్తించారో చూడండి..


Viral Video: వావ్.. నేచురల్ బ్యూటీ.. ఈ అమ్మాయిని చూసి నెటిజన్లు ఎందుకు ఫిదా అవుతున్నారంటే..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 05 , 2025 | 03:30 PM