Share News

Viral: రిస్క్ అని తెలిసీ క్యాండీని గట్టిగా కొరికి దవడ విరగ్గొట్టుకున్న యువతి

ABN , Publish Date - Jan 05 , 2025 | 08:02 PM

రిస్క్ అని తెలిసీ జా బ్రేకర్ కాండీని కొరికిన ఓ యువతి చివరకు దవడ విరగ్గొట్టుకుంది. ీ ఉదంతం ప్రస్తుతం నెట్టింట సంచలనంగా మారింది.

Viral: రిస్క్ అని తెలిసీ క్యాండీని గట్టిగా కొరికి దవడ విరగ్గొట్టుకున్న యువతి

ఇంటర్నెట్ డెస్క్: జా బ్రేకర్ క్యాండీలు.. తెలుగులో చెప్పుకోవాలంటే బాగా గట్టిగా ఉండే చాక్టెట్ల లాంటివి. రకరకాల సైజుల్లో ఇవి లభ్యమవుతుంటాయి. గట్టిగా ఉండే వీటిని ఏం కాదులే అనుకుని గట్టిగా కొరికితే మాత్రం దెబ్బైపోవాల్సిందే. అమెరికా, కెనడాల్లో ఇవి బాగా పాప్యులర్. వీటి విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఇబ్బందులు తప్పవని తెలిసీ ఓ యువతి చూపించిన అత్యుత్సాహం ఆమెకు ఊహించని షాక్ ఇచ్చింది (Viral).

పూర్తి వివరాల్లోకి వెళితే, జవేరియా వసీమ్ అనే 19 ఏళ్ల యువతి కఠినంగా ఉన్న చాక్లెట్‌ను బలంగా కొరికి డవడ విరగ్గొట్టుకుంది. తొలుత ఆమె తన స్నేహితురాలితో కలిసి వెళుతుండగా ఓ షాపులో ఈ క్యాండీలు కనిపించాయి. జా బ్రేకర్ కాండీలుగా వాటికున్న పాప్యులారిటీ గురించి వాళ్లకు తెలుసు. వాటిని గట్టిగా కొరికితే ఇబ్బందులు వస్తాయన్న అవగాహన ఉంది.

Viral: వామ్మో.. పులి పిల్లల వేట.. షాకింగ్ వీడియో!


అయినా కుతూహలం కొద్ది క్యాండీలను కొరకచ్చా అని షాపు యజమానిని అడిగారు. అతడు ఏమి సమాధానం చెప్పాడో తెలీదు కానీ జవేరియా దాన్ని బలంగా కొరికింది. ‘‘నేను క్యాండీని కొరికా. దీంతో, చాక్లెట్‌లో చిన్న రంధ్రం పడింది. అప్పటికే ఆమె దవడలో నొప్పి మొదలైంది. జవేరియా రెండు పళ్లు కూడా కదలడం గమనించింది. అయితే, జవేరియా మరింత తీవ్ర ప్రమాదంలో ఉన్న విషయం ఆమె స్నేహితురాలికి అర్థమైంది. దీంతో, వెంటనే అంబులెన్స్‌ను పిలిపించి ఆమెను ఆసుపత్రికి తరలించింది. అక్కడి ఎక్స్ రే, సిటీ స్కాన్ చేయగా ఆమె దవడ ఫ్రాక్చర్ అయినట్టు తేలింది. దీంతో, వైద్యులు దాదాపు గంటపాటు శ్రమ పడి ఆమె దవడను యథాస్థానంలో పెట్టారు. ఆ తరువాత ఆరు వారాల పాటు దవడ కదలకుండా చేశారు. దీంతో, ఆమెకు ఆహారమే తినడానికి వీలులేకపోయింది.


Viral: ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న పోర్టర్

ఈ అనుభవం జవేరియాను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ‘‘నేను వీటిని చిన్నప్పుడు తినేదాన్ని. కానీ పెద్దవాటిని ఎప్పుడూ ట్రై చేయలేదు. చివరకు ఇలా జరిగింది’’ అంటూ తన పొరపాటును అంగీకరించింది. ప్రస్తుతం జవేరియా ఇతరులను అప్రమత్తం చేస్తుంటుంది. తనలాంటి పొరపాటు చేసి దెబ్బతినొద్దని హెచ్చరిస్తుంటుంది.

Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్

Read Latest and Viral News

Updated Date - Jan 05 , 2025 | 08:02 PM