Share News

Viral: గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాల్సిన రూ.1.5 చిల్లర కోసం 7 ఏళ్ల పాటు పోరాడి గెలిచిన వినియోగదారుడు!

ABN , Publish Date - Jan 06 , 2025 | 07:29 PM

గ్యాస్ ఏజెన్సీ తనకు ఇవ్వాల్సిన రూపాయిన్నర చిల్లర కోసం ఓ వినియోగదారుడు ఏకంగా ఏడేళ్ల పాటు న్యాయపోరాటం చేసి విజయం సాధించారు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాల్సిన రూ.1.5 చిల్లర కోసం 7 ఏళ్ల పాటు పోరాడి గెలిచిన వినియోగదారుడు!

ఇంటర్నెట్ డెస్క్: షాపింగ్ సమయంలో షాపుల వాళ్లు రూ.1.5 చిల్లర లేదని అంటే ఏం చేస్తాం. పోనీలే అని వదిలేస్తాం. చిన్న మొత్తమే కదా అని పట్టించుకోము. కానీ ఓ వినియోగదారుడు మాత్రం తనకు రావాల్సిన రూపాయిన్నర కోసం ఏకంగా ఏడేళ్ల పాటు న్యాయపోరాటం చేసి చివరకు విజయం కూడా సాధించాడు. హక్కుల కోసం పోరాడేందుకు అస్సలు వెనకడుగు వేయొద్దంటూ దేశ ప్రజలకు సందేశం ఇచ్చాడు. అస్సలు నమ్మశక్యంగా లేని ఈ ఉదంతం మధ్యప్రదేశ్‌లో వెలుగు చూసింది (Viral).

పూర్తి వివరాల్లోకి వెళితే, రాష్ట్రంలోని సాగర్ జిల్లాకు చెందిన చక్రేశ్ జైన్ 2017లో గ్యాస్ బుక్ చేసుకున్నాడు. దాని ఖరీదు రూ.753.5. ఇంటికి సిలిండర్ తెచ్చిన డెలివరీ బాయ్‌కు రూ.755 ఇచ్చాడు. అయితే, మిగిలిన రూ.1.5ను చక్రేశ్‌కు డెలివరీ ఏజెంట్ ఇవ్వలేదు. తన వద్ద చిల్లర లేదని అన్నాడు.

Viral: ఇంట్లో అంట్లు తోమనంటూ భారత సంతతి సీఈఓ పోస్టు.. నెట్టింట విమర్శల వెల్లువ


కానీ చిల్లర కోసం చక్రేశ్ జైన్ పట్టుబట్టడంతో సదరు డెలివరీ ఏజెంట్..గ్యాస్ ఏజెన్సీకి ఫిర్యాదు చేయాలని చెప్పి వెళ్లిపోయాడు. చక్రెశ్ ఆ వెంటనే గ్యాస్ ఏజెన్సీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశాడు. కానీ, తన ఫిర్యాదుపై గ్యాస్ ఏజెన్సీ ఎటువంటి చర్యా తీసుకోకపోవడంతో తిక్కరేగిన చక్రేశ్ న్యాయపోరాటానికి దిగాడు. జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశాడు.

అయితే, చక్రేశ్ వాదనలను గ్యా్స్ ఏజెన్సీ వారు కొట్టిపారేశారు. అతడి ఫిర్యాదు అర్థరహితమంటూ హేళన చేసింది. కానీ చక్రేశ్ మాత్రం అస్సలు వెనక్కు తగ్గలేదు. తన లాయర్ సాయంతో సుదీర్ఘ న్యాయపోరాటం ప్రారంభించాడు. ఆ తరువాత ఐదేళ్ల పాటు ఇరు పక్షాల మధ్య వాదోపవాదాలు సాగాయి. చివరకు కన్జ్యూమర్ ఫోరం ఈ కేసులో చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.

Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత


ఈ కేసులో గ్యాస్ ఏజెన్సీ సేవా లోపం ఉన్నట్టు కన్జ్యూమర్ ఫోరం స్పష్టం చేసింది. బాధితుడికి చెల్లించాల్సిన రూ.1.5కు ఏటా ఆరు శాతం వడ్డీ కూడా కలిపి రెండు నెలల్లో చెల్లించాలని గ్యాస్ ఏజెన్సీని ఆదేశించింది. తన చర్యల ద్వారా వినియోగదారుడికి మానసిక, ఆర్థిక ఇబ్బందులు కలిగించినందుకు, సేవా లోపం చేసినందుకు పరిహారంగా రూ.2 వేలు, న్యాయఖర్చుల కోసం మరో రూ.2 వేలు చెల్లించాలని ఆదేశించింది. తన విజయంపై చక్రేశ్ స్పందించారు. ఇది రూ.1.5 కోసం పోరాటం కాదని స్పష్టం చేశారు. ఆత్మగౌరవం, హక్కుల కోసం సుదీర్ఘ పోరాటానికి దిగానని అన్నాడు.

ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న

Read Latest and Viral News

Updated Date - Jan 06 , 2025 | 07:44 PM