Share News

Satellite Vs Smart Phones: శాటిలైట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏవంటే..

ABN , Publish Date - Jan 07 , 2025 | 07:27 PM

స్మార్ట్ ఫోన్లు, శాటిలైట్ ఫోన్ల మధ్య కొన్ని మౌలిక తేడలు ఉన్నాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Satellite Vs Smart Phones: శాటిలైట్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్ల మధ్య ఉన్న ముఖ్యమైన తేడాలు ఏవంటే..

ఇంటర్నెట్ డెస్క్: ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్ గురించి కనీసావగాహన లేని వారు దాదాపుగా ఉండరనే చెప్పాలి. నిత్యం జీవితంలో అంతలా ఇమిడిపోయిన స్మార్ట్ ఫోన్లు. అయితే, శాటిలైట్ ఫోన్లపై జనాల్లో కాస్త అవగాహన తక్కువ. అడపాదడపా వార్తల్లోకెక్కే ఈ ఫోన్లు గురించి వినడమే తప్ప ఇది ఎలా పనిచేస్తుందనే విషయంలో ప్రజల్లో అవగాహన తక్కువ. మరి ఈ రెండు రకాల ఫోన్ల మధ్య మౌలికమైన తేడాలు ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం (Viral).

నిపుణులు చెప్పేదాని ప్రకారం, రెండు ఫోన్లు సమాచారం ఇచ్చి పుచ్చుకునేందుకు ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు. అయితే చూడటానికి ఈ రెండిట్లో అనేక తేడాలు ఉన్నాయి. శాటిలైట్‌ ఫోన్లు నేరుగా ఉపగ్రహాలకు కనెక్ట్ అవుతాయి. కానీ స్మార్ట్ ఫోన్లు మాత్రం టెలికాం టవర్ల సాయంతో నెట్వర్క్‌‌కు అనుసంధానం కావాల్సి ఉంది.


Viral: ఏఐ సాయంతో 19 ఏళ్ల మర్డర్ మిస్టరినీ ఛేదించిన కేరళ పోలీసులు

స్మార్ట్ ఫోన్లు పనిచేసేందుకు 4జ, 5జీ లేదా వైఫై అవసరం. నెట్‌వర్క్ కవరేజీ లేని చోట స్మార్ట్ ఫోన్లు నిరుపయోగం. అయితే, టెలికాం టవర్లతో ఏమాత్రం సంబంధం లేకుండా శాటిలైట్ ఫోన్లు నేరుగా శాటిలైట్లతో అనుసంధానం అవుతాయి. దీంతో, టెలికాం టవర్లు లేని దట్టమైన అడవులు, ఎడారులు, సముద్రాల్లో, పర్వతాల్లో కూడా శాటిలైట్ ఫోన్లను వినియోగించుకోవచ్చు.

శాటిలైట్ ఫోన్లు చూడటానికి కూడా విభిన్నంగా ఉంటాయి. కాల్ లేదా మెసేజ్ చేసినప్పుడు ఈ సిగ్నల్ నేరుగా అంతరిక్షంలో ఉన్న శాటిలైట్‌ను చేరుకుంటుంది. ఆ తరువాత సమాధానంతో కూడిన సిగ్నల్ మరో శాటిలైట్ లేదా గ్రౌండ్ స్టేషన్ ద్వారా శాటిలైట్‌ ఫోన్‌కు అందుతుంది. ఈ ఫోన్లు సాధారణ స్మార్ట్ ఫోన్లతో పోలిస్తే ఎక్కువ విద్యుత్ వినియోగిస్తాయి.

Viral: ఇంట్లో ఒంటరిగా 38 ఏళ్ల మహిళ! చోరీకొచ్చిన దొంగ ఊహించని విధంగా..


శాటిలైట్ ఫోన్లతో ఉపయోగాలు..

నిపుణులు చెప్పే దాని ప్రకారం, ఈ ఫోన్లను భూమ్మీద ఎక్కడైనా వినియోగించుకోవచ్చు. సుదూరాన ఉన్న ప్రాంతాల వారు కూడా ఈ ఫోన్లతో త ఆప్తులతో సంభాషించొచ్చొద్దు. ఇక భూకంపం, వరదలు, ఇతర ప్రకృత్తి విపత్తులు సంభవించిన తరుణంలో ఈ ఫోన్‌ అక్కరకు వస్తుంది. ఇక భద్రతా ప్రమాణాల పరంగా శాటిలైట్ పోన్లు ఎంతో మెరుగు, ఈ ఫోన్లలో యాంటిన్నా బయటకు కనబడుతుంది. శాటిలైట్‌లకు సులువగా అనుసంధానయ్యేందుకు వీలుగా ఇలాంటి ఏర్పాటు చేశారు.

Viral: డాక్టర్లు కడుపులో సూది వదిలిపెట్టడంతో గర్భస్థ శిశువుకు గాయాలు.. బాధితురాలి సంచలన ఆరోపణలు

Read Latest and Viral News

Updated Date - Jan 07 , 2025 | 07:27 PM