Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్
ABN , Publish Date - Jan 02 , 2025 | 04:51 PM
ఓ మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు చిక్కుకుని ఉండటం వైద్యులనే ఆశ్చర్యపరిచింది. బ్రిటన్‌లో వెలుగు చూసిన ఈ ఘటన అక్కడి వైద్య వర్గా్ల్లో కలకలానికి దారి తీసింది. ఏళ్ల తరబడి కంట్లో లెన్సులు ఉన్నా ఆమెకు ఎటువంటి ఇన్ఫెక్షన్లు తలెత్తలేదు.
ఇంటర్నెట్ డెస్క్: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన ఓ మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు ఉన్నట్టు గుర్తించి వైద్యులు షాకైపోయారు. యూకేలో వెలుగు చూసిన ఈ ఘటన వైద్యవర్గాల్లో సంచలనంగా మారింది.
స్థానిక మీడియా కథనాల ప్రకారం, 67 ఏళ్ల మహిళ ఒకరు కుడికంట్లో కాటరాక్ట్ సర్జరీ కోసం వెళ్లారు. ఆమె కుడి కంట్లో సమస్యలేమీ లేకపోయినా ఎడమ కంటికంటే సామర్థ్యం తగ్గిపోయింది. కంట్లో ఎప్పుడూ తడి ఆరినట్టుగా, ఇబ్బందిగా అనిపించడం మినహా ఆమెకు మరే విధమైన సమస్య లేదు (Viral).
Viral: అణుబాంబు తయారీలో బంగాళదుంపలు, ఉల్లిపాయలకు ముఖ్య పాత్ర!
ఇక ఆపరేషన్ సందర్భంగా వైద్యులకు ఆమె పైకనురెప్ప లోపలి వైపు ఉబ్బెత్తుగా కందిపోయి ఉన్నట్టు కనిపించింది. మరింత లోతుగా పరిశీలిస్తే అక్కడ ఏకంగా 17 కాంటాక్ట్ లెన్సులు కనిపించాయి. మైక్రెస్కోప్‌లో పరిశీలిస్తే మరో 10 లెన్సులు బయటపడ్డాయి. దీంతో, వారు ఆమెకు అనస్థీషియా ఇచ్చి వాటిని జాగ్రత్తగా తొలగించి ఆపరేషన్ పూర్తి చేశారు. ప్రభావిత ప్రదేశంలో బ్యాక్టీరియా పెరగకుండా ఈ చర్య చేపట్టారు.
Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!
ఇదేలా సాధ్యమంటే..
మహిళకు కాస్త భిన్నమైన కంటి నిర్మాణం ఉండటంతో ఇన్ని లెన్సులు అక్కడ పోగుపడ్డాయని చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆమె గత 35 ఏళ్లుగా కాంటాక్ట్ లెన్సులను వినియోగిస్తోంది. ప్రతి రాత్రి వాటిని తీసి బాక్సులో పెట్టుకుని మరుసటి రోజు మళ్లీ వినియోగించుకోవాలి. ప్రతి నెల రోజులకు ఒకసారి పాత లెన్సులను పారేసి కొత్త కొనుక్కోవాలి అయితే, కొన్ని సార్లు తన కళ్లల్లో లెన్సు కనిపించేవి కావని, అది కిందపడిపోయి ఉంటుందని తాను భావించి మరో లెన్స్ వాడేదాన్ని ఆమె చెప్పుకొచ్చింది. కనురెప్పలోపలి వైపు అన్ని లెన్సులు ఇరుక్కుపోయి ఉన్నా నొప్పి, ఇన్ఫె్క్షన్లు వంటివి లేకపోవడం నిజంగా ఆశ్చర్యమేనని వైద్యులు అన్నారు.
Viral: వేటగాళ్ల నుంచి కాపాడేందుకు ఖడ్గమృగం కొమ్ము తొలగింపు.. షాకింగ్ వీడియో
నిపుణులు చెప్పేదాని ప్రకారం కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్లు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. శుభ్రంగా చేతులు కడుక్కున్నాకే కాంటాక్ట్ లెన్సులు కళ్లల్లోంచి తీయడం, పెట్టుకోవడం చేయాలి. కాంటాక్ట్ లెన్స్‌తో అస్సలు నిద్రించొద్దు. ఇలా చేస్తే ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. కంట్లో పెట్టుకున్న లెన్స్ కనబడకపోతే వెంటే వైద్యులను సంప్రదించాలి. ఎక్కడో జారిపోయి ఉంటుందనుకుని నిర్లక్ష్యం ప్రదర్శించవద్దు. ఇక నిత్యం ఐచెకప్‌లకు వెళుతూ ఉంటే కంటి సమస్యలను మొదట్లోనే గుర్తించి పరిష్కరించుకోవచ్చు.