Share News

Viral Video: వామ్మో.. ప్రమాదం కూడా ఇతడిని చూస్తే భయపడుతుందేమో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చూడండి..

ABN , Publish Date - Jan 01 , 2025 | 05:41 PM

ఎగ్జిబిషన్‌కు వెళ్లిన వాళ్లు తప్పకుండా జెయింట్ వీల్‌ను చూసే ఉంటారు. సాధారణంగా చాలా తక్కువ మంది మాత్రమే జెయింట్ వీల్‌ను ఎక్కుతారు. వారు కూడా జెయింట్ వీల్ సీట్లలో గట్టిగా పట్టుకుని కళ్లు మూసుకుని కూర్చుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ప్రాణాంతక సాహసం చేశాడు.

Viral Video: వామ్మో.. ప్రమాదం కూడా ఇతడిని చూస్తే భయపడుతుందేమో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చూడండి..
Viral Stunt

సాధారణంగా ఎగ్జిబిషన్‌కు వెళ్లడం చిన్న పిల్లలకే కాదు.. పెద్ద వాళ్లకు కూడా థ్రిల్లింగ్ అనుభవాన్ని ఇస్తుంది. ఎగ్జిబిషన్‌ (Exhibition)కు వెళ్లిన వాళ్లు తప్పకుండా జెయింట్ వీల్‌ను చూసే ఉంటారు. సాధారణంగా చాలా తక్కువ మంది మాత్రమే జెయింట్ వీల్‌ను ఎక్కుతారు. వారు కూడా జెయింట్ వీల్ (Gaint Wheel) సీట్లలో గట్టిగా పట్టుకుని కళ్లు మూసుకుని కూర్చుంటారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి ప్రాణాంతక సాహసం చేశాడు. ఆ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@terakyalenadena అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఎగ్జిబిషన్‌లో భారీ జెయింట్ వీల్ కనబడుతోంది. వేగంగా తిరుగుతున్న ఆ జెయిట్ వీల్ మీద ఓ వ్యక్తి సాహసం చేశాడు. ఊయల మీద నిల్చుని సాహస కృత్యం చేశాడు. చక్రంతో పాటు తిరుగుతూనే పైకి, కిందకు తిరుగుతూ సాహసం చేశాడు. అతడి సాహసాన్ని చూస్తున్న వారికే కళ్లు తిరిగేలా ఉన్నాయి. అలాంటిది ఆ వ్యక్తి ఏ మాత్రం భయం లేకుండా ప్రశాతంతగా దాని మీద నిల్చున్నాడు. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యపోతున్నారు.


అతడి సాహసాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 20 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను వీక్షించారు. 11 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``అతడు ప్రమాదానికే ప్రమాదం కలిగిస్తాడు``, ``ఇతడిని చూసి స్పైడర్ మ్యాన్ కూడా భయపడతాడు`` అంటూ నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: కోట్లు విలువ చేసే కారు.. ఎడ్లబండి సహాయం లేకపోతే బయటకు రాలేకపోయింది.. వీడియో వైరల్..


Viral Video: కళ్లెదురుగానే మోసం.. యాపిల్స్ అమ్ముకునే వ్యక్తి ఎలా ఛీటింగ్ చేస్తున్నాడో చూస్తే..


IQ Test: ఈ ఆది మానవుల మధ్య ఒక ఆధునికుడు ఉన్నారు.. అది ఎవరో కనిపెడితే మీ బ్రెయిన్ సూపర్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jan 01 , 2025 | 05:41 PM