Share News

Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..

ABN , Publish Date - Jan 06 , 2025 | 08:24 PM

కన్నకొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై కన్నేసిన ఓ తండ్రి వారు విడిపోయేలా కుట్ర పన్ని ఆమెను సొంతం చేసుకున్నాడు. విషయం తెలిసి షాకైపోయిన కుమారుడు చివరకు ఆరోగ్యం దెబ్బతిని ఆసుపత్రి పాలయ్యాడు. చైనాలో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..

ఇంటర్నెట్ డెస్క్: దైవభక్తి, పాప భీతి కొడిగడుతున్న కాలం ఇది. డబ్బు, శారీరక వాంఛల కోసం వావివరుసలు మరిచి ఎంతటి దారుణానికైనా సిద్ధపడే నీచుల బాగోతాలు నిత్యం వెలుగు చూస్తున్నాయి. ఈ కోవకు చెందిన ఓ షాకింగ్ ఘటన తాజాగా చైనాలో వెలుగు చూసింది. కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న ఓ తండ్రి ఆమెను చేజిక్కించుకునేందుకు భారీ కుట్రకు పాల్పడి యువతిని సొంతం చేసుకున్నాడు (Viral).

బ్యాంక్ ఆఫ్ చైనా మాజీ చైర్మన్ లియూ లియాంఘా ప్రస్తుతం జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమంగా రూ.3887 కోట్ల లోన్లు మంజూరు చేసి రూ.141 కోట్లు లంచం తీసుకున్నట్టు రుజువు కావడంతో కోర్టు ఆయనకు మరణ శిక్ష విధించింది. అయితే, శిక్ష అమలును కోర్టు రెండేళ్ల పాటు వాయిదా వేసినప్పటికీ కన్నకొడుకుకు ఆయన చేసిన ద్రోహం తాజాగా వెలుగులోకి రావడంతో లియూ మరోసారి వార్తల్లోకెక్కారు.

Viral: గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాల్సిన రూ.1.5 చిల్లర కోసం 7 ఏళ్ల పాటు పోరాడి గెలిచిన వినియోగదారుడు!


స్థానిక మీడియా కథనాల ప్రకారం, లియూ కుమారుడు తన గర్ల్‌ఫ్రెండ్‌ను పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆమెను ఇంటికి తీసుకొచ్చి తండ్రితో పాటు ఇతర కుటుంబసభ్యులకు పరిచయం చేశాడు. కానీ ఆమెను చూడగానే లియూ మనసు చెదిరింది. ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావించి భారీ కుట్రకు తెరతీశాడు.

ఆ యువతి తమ కుటుంబానికి తగిన వ్యక్తి కాదని కొడుకును ఏమార్చే ప్రయత్నం చేశాడు. ఆమెది సంపన్న నేపథ్యం కాదని, కొడుకు ఏమాత్రం సరిజోడీ కాదని నచ్చజెప్పాడు. యువతిని వదులుకోవడం ఇష్టం లేకపోయినప్పటికీ తండ్రి మాట కాదనలేక, ఆయన వాదనను తోసి పుచ్చలేక అతడు యువతికి దూరమయ్యాడు. అయితే, కొడుకు శాశ్వతం అడ్డం తొలగించుకునేందుకు లియూ తన స్నేహితుడి కూతురినిచ్చి పెళ్లి చేసి దూరంగా పంపించాడు.

Viral: ఇంట్లో అంట్లు తోమనంటూ భారత సంతతి సీఈఓ పోస్టు.. నెట్టింట విమర్శల వెల్లువ


ఆ తరువాత తన శక్తియుక్తులన్నీ ప్రయోగించి కొడుకు మాజీ గర్ల్‌ఫ్రెండ్ జాడ కనుక్కున్నాడు. ఆమె ఇంటికి ఖరీదైన బహుమతులు పంపి, మాయమాటలు చెప్పి తనను పెళ్లాడమని కోరాడు. ఆమె ఇందుకు అంగీకరించింది. చివరకు 2023లో ఆమెను పెళ్లాడాడు.

ఈ క్రమంలో తండ్రి వివాహం గురించి తెలిసిన కొడుకుకు నిర్ఘాంత పోయాడు. తనకు మాయమాటలు చెప్పి ఆమెను సొంతం చేసుకున్నాడని తెలిసి కుమిలిపోయాడు. చివరకు ఆరోగ్యం చెడి ఆసుపత్రి పాలయ్యాడు. అయితే, లియూ వివాహమైన కొద్ది నెలలకే అతడి లంచాల బాగోతం బయటపడటంతో చివరకు జైలు పాలయ్యాడు.

Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత

Read Latest and Viral News

Updated Date - Jan 06 , 2025 | 08:28 PM