Share News

Revenge on her ex-boyfriend: మాజీ ప్రియుడికి దిమ్మదిరిగే షాకిచ్చిన యువతి.. వాలంటైన్స్ డే రోజు స్వీట్ రివేంజ్..

ABN , Publish Date - Feb 15 , 2025 | 10:58 AM

వాలంటైన్స్ డే సందర్భంగా ఎన్నో రొమాంటిక్ స్టోరీలను విని ఉంటారు. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడికి కోలుకోలేని షాకిచ్చింది. జీవితంలో మర్చిపోలేని విధంగా పగ తీర్చుకుంంది. ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని గురించి చదివితే నవ్వు రాకమానదు.

Revenge on her ex-boyfriend: మాజీ ప్రియుడికి దిమ్మదిరిగే షాకిచ్చిన యువతి.. వాలంటైన్స్ డే రోజు స్వీట్ రివేంజ్..
Girl took a sweet revenge on her ex-boyfriend

వాలంటైన్స్ డేను (Valentine's Day) ప్రేమికులు మరపురాని రోజుగా మార్చుకోవాలని ప్రణాళికలు వేస్తున్నారు. తమ ప్రియమైన వారితో కలిసి ఎంజాయ్ చేయాలనుకుంటారు (Lovers). వాలంటైన్స్ డే సందర్భంగా ఎన్నో రొమాంటిక్ స్టోరీలను విని ఉంటారు. అయితే వాలంటైన్స్ డే సందర్భంగా ఓ అమ్మాయి తన మాజీ ప్రియుడి (Ex-Boyfriend)కి కోలుకోలేని షాకిచ్చింది. జీవితంలో మర్చిపోలేని విధంగా పగ (Revenge) తీర్చుకుంంది. ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాని గురించి చదివితే నవ్వు రాకమానదు.


గుర్గావ్‌కు చెందిన 24 ఏళ్ల అమ్మాయి ప్రేమికుల రోజున తన మాజీ ప్రియుడికి షాకచ్చింది. ఆమె కొన్ని రోజుల క్రితం అతడి నుంచి విడిపోయింది. అయితే అతడిపై పగ తీర్చుకోవడానికి వాలంటైన్స్ డే రోజును ఎంచుకుంది. తన మాజీ ప్రియుడి ఇంటి అడ్రస్‌కు ఏకంగా 100 పిజ్జాలు (Pizzas) ఆర్డర్ చేసింది. అన్ని పిజ్జాలు ఒకేసారి రావడం చూసి ఆ వ్యక్తి నివ్వెరపోయాడు. ఆర్డర్లు అన్నింటికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ పెట్టింది. మ్యాజిక్‌పిన్ ఫుడ్ డెలివరీ యాప్ ఏజెంట్.. ఆ వ్యక్తి ఇంటి తలుపు బయట పిజ్జా బాక్సులను పేర్చేశాడు. ఆ తర్వాత డెలివరీ బాయ్ క్యాష్ అడిగినప్పుడు, ఆ విషయం వాగ్వాదానికి దారితీసింది.


ఈ ఘటనపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు. కొందరు నవ్వుతున్న ఎమోజీలను పోస్ట్ చేశారు. మరికొందరు మాత్రం ఆ అమ్మాయి చర్యను తప్పుపట్టారు. ``ఇందులో నవ్వుకోవడానికి ఏముంది? ఆ అమ్మాయి తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ను హింసిస్తోంది``, ``వామ్మో.. ఇలా కూడా పగ తీర్చుకుంటారా``, ``ఆమె తన మాజీ ప్రియుడిని మర్చిపోలేకపోతోంది`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..


Optical Illusion: ఈ ఫొటోలో మీకు గుర్రం కనబడితే.. మీరు సాధారణమైన వ్యక్తి కాదు.. ప్రయత్నించండి..


Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2025 | 10:58 AM