Viral Video: వీళ్లకి నరకంలో కూడా చోటు దొరకదు.. సరస్వతి పూజలో ఎలాంటి డ్యాన్స్ వేస్తున్నారో చూడండి..
ABN , Publish Date - Feb 15 , 2025 | 09:08 AM
ప్రస్తుతం ఏ పండగ, ఫంక్షన్ జరిగినా డ్యాన్స్ కార్యక్రమాలు తప్పనిసరిగా మారిపోయాయి. ఫిమేల్ డ్యాన్సర్ల చిందులు ఆనావాయితీగా మారిపోయాయి. అయితే అన్ని కార్యక్రమాల్లోనూ డ్యాన్స్ వేదికలను ఏర్పాటు చేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.

ప్రస్తుతం ఏ పండగ, ఫంక్షన్ జరిగినా డ్యాన్స్ (Dance) కార్యక్రమాలు తప్పనిసరిగా మారిపోయాయి. ఫిమేల్ డ్యాన్సర్ల చిందులు ఆనావాయితీగా మారిపోయాయి. అయితే అన్ని కార్యక్రమాల్లోనూ డ్యాన్స్ వేదికలను ఏర్పాటు చేయడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. ఎంతో పవిత్రంగా చేసుకునే సరస్వతి పూజా కార్యక్రమంలో కూడా ఈ డ్యాన్సర్ల గోల తప్పడం లేదు. సరస్వతి పూజా (Saraswati Puja) కార్యక్రమంలో అశ్లీలంగా డ్యాన్స్ (obscene dance) చేస్తున్న అమ్మాయిలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియో చూసిన జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు (Viral Video).
@veejuparmar అనే ట్విటర్ ఖాతాలో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. డ్యాన్స్ కోసం ఓ వేదికను ఏర్పాటు చేశారు. చుట్టూ జనాలు ఉన్నారు. ఆ వేదిక మీద పెట్టిన బ్యానర్ మీద ``సరస్వతి పూజకు హృదయపూర్వక ఆహ్వానం`` అని రాసి ఉంది. నేపాల్‌లోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆ వీడియోలో ఒక అమ్మాయి భోజ్‌పురి పాటకు అశ్లీల నృత్యం చేస్తోంది. అక్కడి అమ్మాయిలు, అబ్బాయిలు తీరు పూజ కార్యక్రమంలో ఉన్నట్టు కాకుండా, ఏదో బార్‌లో ఉన్నట్టు ఉంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వైరల్ వీడియోకు సోషల్ మీడియాలో వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై చాలా మంది సోషల్ మీడియా జనాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ``వీరికి నరకంలో కూడా చోటు ఉండదు``, ``అది ఎలాంటి కాలేజ్ అనేది అర్థం అవుతోంది``, ``ఇది ఏ రకమైన సరస్వతి పూజ``, ``వీళ్లపై కేసులు పెట్టాలి`` అంటూ సోషల్ మీడియా జనాలు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Optical Illusion: ఈ ఫొటోలో మీకు గుర్రం కనబడితే.. మీరు సాధారణమైన వ్యక్తి కాదు.. ప్రయత్నించండి..
Online order: రూ.61 వేల విలువైన ల్యాప్‌టాప్ ఆర్డర్ చేశాడు.. పార్సిల్ ఓపెన్ చేసి చూసి నివ్వెరపోయాడు..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..