Kerala Anganwadis: బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి.. చిన్నారి కోరిక.. కేరళ అంగన్వాడీ మెనూపై రివ్యూ..
ABN , Publish Date - Feb 04 , 2025 | 10:48 AM
ఓ చిన్నారి కోరిక రాష్ట్ర ప్రభుత్వాన్నే ఆలోచనలో పడేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్పులకు శ్రీకారం కాబోతోంది. ఏకంగా మంత్రి స్పందించి తగు చర్యలు ఆదేశించడానికి కారణమైంది. అంగన్‌వాడీలో ఉప్మాకు బదులుగా బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలని అమాయకంగా అడుగుతున్న ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ చిన్నారి కోరిక రాష్ట్ర ప్రభుత్వాన్నే ఆలోచనలో పడేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మార్పులకు శ్రీకారం కాబోతోంది. ఏకంగా మంత్రి స్పందించి తగు చర్యలు ఆదేశించడానికి కారణమైంది. అంగన్‌వాడీలో (Anganwadis) ఉప్మాకు బదులుగా బిర్యానీ (Biryani), చికెన్ ఫ్రై (Chicken Fry) కావాలని అమాయకంగా అడుగుతున్న ఓ చిన్నారి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి ఏకంగా ప్రభుత్వ పెద్దలనే ఆలోచనలో పడేసింది. ఈ నేపథ్యంలో కేరళలోని చిన్న పిల్లల సంరక్షణ కేంద్రాల మెనూలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందించారు (Anganwadi Menu in kerala).
వైరల్ అవుతున్న ఆ వీడియోలో, టోపీ ధరించిన శంకు అనే చిన్న పిల్లవాడు అమాయకంగా తన తల్లిని.. ``నాకు అంగన్‌వాడీలో ఉప్మాకు బదులుగా బిర్నానీ (బిర్యానీ) పోరిచా కోజి (చికెన్ ఫ్రై) కావాలి`` అని అడిగాడు. ఆ కుర్రాడు చెబుతుండగా ఆ తల్లి వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోను శిశు సంక్షేమ శాఖ మంత్రి వీణా జార్జ్ సోమవారం తన ఫేస్‌బుక్ పేజీలో షేర్ చేశారు. ఆ చిన్నారి అమాయకంగా చేసిన అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటున్నామని ఆమె అన్నారు. మెనూను రివ్యూ చేస్తామని అన్నారు.
కాగా, ఆ చిన్నారి వైరల్ వీడియోకు చాలా మంది మద్దతుగా కామెంట్లు చేశారు. ప్రభుత్వం జైళ్లలో దోషులకు అందించే ఆహారాన్ని తగ్గించాలని, అంగన్‌వాడీల ద్వారా పిల్లలకు మెరుగైన భోజనం అందించాలని కొందరు సూచించారు. ఆ చిన్నారి కోరిక సమంజసంగానే ఉందని చాలా మంది కామెంట్లు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి వెంటనే స్పందించి అంగన్వాడీ మెనూపై రివ్యూ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Business idea: బిజినెస్ ఐడియా అంటే ఇలా ఉండాలి.. కొన్ని రోజుల్లో అంబానీని దాటేస్తాడేమో..
Optical Illusion: ఈ అడవిలో పాము ఎక్కడుంది.. మీ దృష్టి షార్ప్ అయితేనే 6 సెకెన్లలో కనిపెట్టగలరు..
Spider rain in Brazil: ఆకాశం నుంచి సాలెపురుగల వర్షం.. బ్రెజిల్‌లో వింత ఘటన.. కారణం ఏంటో తెలిస్తే..
Viral Video: తలుపు తెరవగానే మృత్యు దేవత.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి