Share News

Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్

ABN , Publish Date - Jan 03 , 2025 | 12:56 PM

వారంమంతా ఆఫీసులో పనిచేయడం కూడా తనకు ఇష్టమేనంటూ ఓ యువకుడు చెప్పడంపై యువతి సందేహం వెలిబుచ్చింది. ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా అంటూ నెట్టింట ఆమె పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.

Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్

ఇంటర్నెట్ డెస్క్: ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి పేరు ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో తరచూ చర్చకు వస్తున్న విషయం తెలిసిందే. యువత వారానికి 70 గంటలు పనిచేయాలన్న ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి నెట్టింట షేర్ చేసుకున్న ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. వారానికి 7 రోజులూ ఆఫీసుకు వెళ్లడం ఇష్టమన్న వ్యక్తితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా అంటూ ఆ యువతి ఈ పోస్టును షేర్ చేసింది (Viral).

హింజ్‌ యాప్‌లో తనకు ఓ మ్యాచ్ వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. తమ ఇద్దరి అభిరుచులు కలిసినట్టు యాప్‌లో కనిపించడంతో తాను అతడితో చాట్ చేసినట్టు చెప్పుకొచ్చింది. తనకు వారంలో ఏడు రోజులు ఆఫీసుకు వెళ్లి రావాలన్నా ఎటువంటి అభ్యంతరం లేదని అతడు అన్నాడని వివరించింది.

Viral: బాస్మతీ రైస్ బ్యాగుతో షాపింగ్‌కు వచ్చిన అమెరికా ధనవంతురాలు.. షాక్‌లో జనాలు!


అతడి కంపెనీలో వారానికి మూడు రోజుల పాటు వర్క్ ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించే హైబ్రీడ్ మోడల్ అమల్లో ఉన్నా ఆఫీసుకు వెళ్లేందుకు అతడు ఇష్టపడటం తనకు వింతగా తోచిందని చెప్పుకొచ్చింది. ఇన్ఫీ నారాయణ మూర్తి ఫ్యాన్‌లాగా ఉన్నాడని సరదా వ్యాఖ్య చేసిన ఆమె అతడితో డేటింగ్‌కు ప్రొసీడ్ అవ్వచ్చో లేదో తెలీట్లేదని అన్నది. ఆఫీసులో ఎవరిపైనైనా మనసు పారేసుకుని వారమంతా ఆఫీసుకు వెళ్లాలని అనుకుంటున్నాడేమో అని సందేహం వ్యక్తం చేసింది. రిఫరల్ కోసం అడిగితే అతడు నో చెప్పాడని కూడా పేర్కొంది. తమ సంభాషణకు సంబంధించిన స్క్రీన్ షాట్లను కూడా షేర్ చేసింది.

Viral: ప్రపంచంలో అతి భారీ ట్రాఫిక్ జామ్! 100 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!


తనకు ఆఫీసులో పనిచేయడమే ఇష్టమని అతడు ఆమెతో అన్నాడు. ఆఫీసులో పనే తనకు బాగుంటుందని, పైగా తన కార్యాలయానికి ఇంటి నుంచి కేవలం 2 నిమిషాల్లో చేరుకోవచ్చని తెలిపాడు.

ఇక దీనిపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఆఫీసులో ఉండి పనిచేయడమే బెటరని అతడు భావించి ఉండొచ్చని కొందరు వివరించారు. అంతగా అతడిని సందేహించాల్సిన అవసరం లేదని అన్నారు. వర్క్ ఫ్రమ్ హోం కంటే తనకు ఆఫీసు నుంచే పని ఇష్టమని కొందరు చెప్పుకొచ్చారు. కొలీగ్స్‌తో కలిసి సరదాగా పని చేస్తుంటే టైమే తెలీదని అన్నారు. దూరాన ఉండే ఆఫీసుకు రోజూ వెళ్లి రాలేకే అనేక మంది వర్క్ ఫ్రమ్ ఇష్టపడతారని, తన పనిని ఇష్టపడే అతడిని సందేహించాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్

Read Latest and Viral News

Updated Date - Jan 03 , 2025 | 01:00 PM