Viral: గ్రీన్‌లాండ్‌ను కొనేయాలని ఉబలాటపడుతున్న ట్రంప్.. ఎంత ఖర్చవుతుందంటే..
ABN , Publish Date - Jan 12 , 2025 | 07:36 PM
డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్‌ను అమెరికా కొనుగోలు చేయాలంటే సుమారు 77 బిలియన్ డాలర్ల ఖర్చవుతుందని ఓ రియల్ ఎస్టేట్ డెవలపర్ అంచనా వేశారు. ప్రస్తుతం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా భద్రత కోసం గ్రీన్‌లాండ్‌ను సొంతం చేసుకోవాలనేది డొనాల్డ్ ట్రంప్ ప్లాన్. అది అసలు సాధ్యమేనా అనే చర్చ ఓవైపు కొనసాగుతుంటే అసలు గ్రీన్‌లాండ్ కొనుగోలు చేయాలంటే ఎంత ఖర్చవుతుందనేదానిపై జనాలు మరో చర్చ మొదలెట్టారు. అయితే, డేవిడ్ బార్కర్ అనే రియల్ ఎస్టేట్ డెవలపర్ ఈ విషయంలో తన అంచనాను తాజాగా వెల్లడించారు. అంతర్జాతీయ మీడియాలో కూడా ప్రచురితమైన ఈ కథనాలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి (Greenland - USA).
గతంలోనే అమెరికా ఇలాగే అలాస్కా, వర్జిన్ ఐల్యాండ్స్‌ను కొనుగోలు చేసింది. వాటి ధరల ఆధారంగా డేవిడ్ బార్కర్.. గ్రీన్ ల్యాండ్ ధర రూ.2.5 బిలియన్ డాలర్ల నుంచి 77 బిలియన్ల వరకూ ఉండొచ్చని అంచాన వేశారు. ద్రవ్యోల్బణం, గ్రీన్‌లాండ్ ఆర్థికాభివృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అంచనాను రూపొందించారు.
USA-Canada: కెనడా అమెరికాలో విలీనమైతే జరిగేది ఇదే..
అయితే, ఇటీవల ఫైనాన్షియల్ టైమ్స్ గ్రీన్‌లాండ్‌లో వనరుల విలువ 1.1 ట్రిలియన్ డాలర్లని లెక్కకట్టింది. కానీ బార్కర్ మాత్రం ఈ అంచనాలు సబబు కాదని స్పష్టం చేశారు. వనరుల వెలికితీతతో అమెరికాకు అంత లాభం ఉండకపోవచ్చని, ప్రైవేటు కంపెనీలు ఈ హక్కులను తమ లాభాలను అనుగూణంగా తక్కువకు అమెరికా నుంచి కొనుగోలు చేసే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.
Russia: సంతానోత్పత్తి రేటు పెంచేందుకు రష్యాలో మరో కొత్త పథకం! విద్యార్థినులకు మాత్రమే!
గ్రీన్ లాండ్ ధరను లెక్కించడం అంతా ఆషామాషీ వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి డీల్స్‌లో జీడీపీ పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, ఆ ప్రాంత భవిష్యత్తును జీడీపీ ఆధారంగా లెక్కించలేమని అంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం జీడీపీ 3.23 బిలియన్ డాలర్లుగా ఉన్నప్పటికీ దేశ అసలు సంపద భవిష్యత్తులో చోటుచేసుకునే వృద్ధి అంచనాలు, సహజవనరులు వంటివాటిపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
వాస్తవానికి గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ 2019లోనే దృష్టిసారించారు. గ్రీన్‌లాండ్‌ను కొనుగోలు చేసేందుకు అమెరికా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. నిపుణులు చెప్పే దాని ప్రకారం, గ్రీన్‌లాండ్.. అమెరికా భద్రత దృష్ట్యా వ్యూహాత్మక ప్రాధాన్యమున్న ప్రాంతం. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో కూడా ఈ ప్రాంతం అమెరికాకు అక్కరకొచ్చింది. అప్పటి అమెరికా అధ్యక్షుడు హారీ ట్రూమన్ గ్రీన్‌లాండ్ కొనుగోలుకు 100 మిలియన్ డాలర్ల విలువైన బంగారం ఇస్తామని డెన్మార్క్‌కు ఆఫర్ చేశారు. ఇలా పక్క దేశాల భూభాగాలను కొనాలనుకోవడం అమెరికాకు కొత్తేమీ కాదని చరిత్రకారులు చెబుతున్నారు. లూయీసియానా, అలాస్కా, యూఎస్ వర్జిన్ ఐల్యాండ్స్‌ను అమెరికా ఇలాగే కొనుగోలు చేసింది.
Donald Trump : ట్రంప్ విస్తరణ కాంక్ష!
Read Latest and International News