Viral: అణుబాంబు తయారీలో బంగాళదుంపలు, ఉల్లిపాయలకు ముఖ్య పాత్ర!
ABN , Publish Date - Jan 02 , 2025 | 12:35 PM
పోఖ్రాన్ అణుపరీక్ష సందర్భంగా శాస్త్రవేత్తలు రేడియో ధార్మికత నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ఉల్లిపాయలు, బంగాళదుంపలను వాడారట. అసలు అణుపరీక్షల్లో కూరగాయల పాత్ర ఏంటో ఈ ఆసక్తికర కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఏంటి.. ఆశ్చర్యపోయారా? కూరగాయలకు, అణుబాంబులకు సంబంధం ఏమిటని ఆలోచిస్తున్నారా? రెండిటి మధ్య కీలక సంబంధమే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరి అణుబాంబుల తయారీలో బంగాళదుంప ప్రస్తావన ఎందుకొచ్చిందో తెలియాలంటే (Viral) ఈ కథనం చదవాల్సిందే..
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర ఆయుధం అణుబాంబు అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తొమ్మిది దేశాలు మాత్రమే ఈ బాంబును తయారు చేయగలవు. వీటి తయారీకి అత్యాధునిక సాంకేతికత అవసరం. అణుబాంబుల అభివృద్ధి, పరీక్షలు అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుంది. ఇంతటి సంక్లిష్టమైన ప్రక్రియలో బంగాళదుంపలు, ఉల్లిపాయలకు ముఖ్య భూమిక ఉంది.
అణుబాంబు తయారీలో వీటిని నేరుగా వినియోగించకపోయినా ఈ బాంబుల అభివృద్ధిలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన దేశం పోఖ్రాన్ పరీక్షలతో తొలిసారి అణుబాంబును పరీక్షించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షల సందర్భంగా శాస్త్రవేత్తలు ప్రయోగస్థలంలో బంగాళదుంపలు, ఉల్లిపాయలను పాతిపెట్టారట.
Viral: వేటగాళ్ల నుంచి కాపాడేందుకు ఖడ్గమృగం కొమ్ము తొలగింపు.. షాకింగ్ వీడియో
ఈ రెండిటిలో నీరు సమృద్ధిగా ఉంటుంది. అంతేకాకుండా, వీటి నిర్మాణంలో కూడా గాఢత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, రేడియోధార్మికతను గ్రహించే సామర్థ్యం ఈ రెండిటికీ ఎక్కువ. ఇక అణుపరీక్షల సందర్భంగా అణుధార్మిక తరంగాలు అధికమొత్తంలో వెలువడతాయి. వీటివల్ల పర్యావరణానికి ఎటువంటి హానీ కలగకుండా శాస్త్రవేత్తలు అప్పట్లో ప్రయోగస్థలంలో వీటిని పెట్టారట. వీటితో శాస్త్రవేత్తలకు కూడా అణుధార్మిక కిరణాల నుంచి రక్షణ లభిస్తుందట.
Meditation: ఈ సంవత్సరం మీ జీవితంలో గొప్ప మార్పులు కోరుకుంటున్నారా? ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి!
అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, ప్రస్తుతం ప్రపంచంలో సుమారు 13 వేల అణు వార్ హెడ్లు ఉన్నాయి. వీటిలో అత్యధికం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, యూకేల వద్దే ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద కూడా అణ్వాయుధాలు ఉన్నాయని కొందరి అంచనా. అయితే, ఇజ్రాయెల్ మాత్రం ఈ విషయమై ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. ఇక 1961లో అప్పటి సోవియట్ యూనియన్ పరీక్షించిన జార్ బంబా అణుబాంబు ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైనదిగా పేరు కాంచింది. ఇది 50 మెగాటన్నుల టీఎన్‌టీ విస్ఫోటనంతో సమానమైన శక్తి విడుదల చేస్తుంది.