Share News

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

ABN , Publish Date - Mar 24 , 2025 | 05:17 PM

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించింది. తనకు తోడి పెళ్లి కూతురుగా ఉండాలని కోరింది. దీంతో చిన్న నాటి స్నేహితురాలి కోరికను కాదనలేక పోయింది. అలానే అంటూ ఒప్పుకుంది. వారం తిరక్కుండానే వివాహనికి పిలిచిన యువతి.. తన స్నేహితురాలికి షాక్ ఇచ్చింది.

Bridesmaid Package: వివాహానికి ఆహ్వానించి.. అంతలోనే షాక్ ఇచ్చిన స్నేహితురాలు

ప్రస్తుతం వివాహం అంటేనే భారీ ఖర్చుతో కూడుకున్నది. ఈ విషయం అందరికి తెలిసిందే. అలాంటి వేళ తన క్లాస్‌మెట్ మేగన్ వివాహం చేసుకొంటుంది. ఆ క్రమంలో తనను తోడి పెళ్లి కూతురుగా ఉండాలంటూ మనస్ఫూర్తిగా కోరింది. తమ చిన్న నాటి స్నేహం తాలుకా జ్జాపకాలు తన స్నేహితురాలు మేగన్‌ను ఇంకా వెంటాడుతున్నాయని ఆమె మురిసిపోయింది. తన స్నేహితురాలు కోరుకున్నట్లే..ఈ వివాహ వేడుకల్లో తోడి పెళ్లి కూతురుగా ఉండాలని ఆమె నిర్ణయించుకొంది.

అయితే ఇంతలో తన స్నేహితురాలు మేగన్ నుంచి ఈ మెయిల్ వచ్చింది. అందులో తోడి పెళ్లి కూతురుని అలంకరించేందుకు .. అంటే మేకప్, డ్రస్సింగ్ ఇతరత్ర అలంకరణతోపాటు వధువుకు బహుమతి కింద ఈ నగదు చెల్లించాలని స్పష్టం చేసింది. దీంతో ఆమె ఒక్కసారిగా అవాక్కయింది. ఇదే విషయాన్ని తన స్నేహితురాలు మేగన్‌తో చర్చించింది. ఈ రోజుల్లో ఇదంతా సర్వ సాధారణమేనని పేర్కొంది.


అంతేకాదు.. వివాహం అన్న తర్వాత ఈ మాత్రం ఖర్చులు ఉంటాయంటూ తన స్నేహితురాలికి మేగన్ స్పష్టం చేసింది. ఈ ప్యాకేజీని మార్చడం కుదరదని తన స్నేహితురాలితో పేర్కొంది. దీంతో ఈ వివాహ వేడుకకు హాజరు కాకూడదని ఆమె నిర్ణయం తీసుకుంది. ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై చర్చ సాగుతోంది. అలాంటి వేళ.. యూజర్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.


ఆ క్రమంలో ఓ యూజర్ సోషల్ మీడియాలో ఇలా పేర్కొన్నాడు.. నీ వద్ద నగదు లేకుంటే.. ఆ నగదు ఇవ్వలేరు. ఆ క్రమంలో మీరు ఇలా చెప్పొచ్చు. తనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తాను దీనిని తిరస్కరిస్తున్నానని మీ స్నేహితురాలకి చెప్పవచ్చని సూచించారు. పలువురు యూజర్లు సైతం ఇదే తరహాలో స్పందించారు.

ఇవి కూడా చదవండి..

Cell Phones: పిల్లలను సెల్ ఫోన్‌కు దూరంగా ఉంచాలంటే.. ఈ టిప్స్ ఫాలో అయితే చాలు..

మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 24 , 2025 | 05:17 PM