Viral: వామ్మో.. ఇలా అయితే భారత్ వెనకబడినట్టే.. ఆనంద్ మహీంద్రా పోస్టు వైరల్
ABN , Publish Date - Jan 09 , 2025 | 10:15 PM
కారులోని ముందు సీట్లకు ట్యాబ్లెట్‌లు, ఇతర పరికరాలను తగిలించుకుని వీడియోలు చూసుకునేందుకు వీలుగా ఓ వ్యక్తి చేసిన ఏర్పాటు ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. ఆయన షేర్ చేసిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట పంచుకునే అంశంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. దీంతో, నిత్యం ఆయన పోస్టులు తరచూ వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా విదేశీయుడి తన సమస్యను చిన్న చిట్కాతో పరిష్కరించిన వైనం చూసి ఆశ్చర్యపోయారు. చిట్కా పరిష్కాల్లో ముందుండే భారతీయులనే మించిపోయేలా అతడు చేసిన ప్రయోగాన్ని పొగుడుతూ పోస్టు పెట్టారు. జనాలకు కూడా ఇది నచ్చడంతో ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది (Viral).
ఖరీదైన కార్లు, ఇతర వాహనాల్లో సీట్లకే ట్యాబ్లెట్లు, స్క్రీన్లు అమర్చి ఉంటాయి. వీటిలో నచ్చిన వీడియోలను జర్నీ చేస్తూనే చూడొచ్చు. చేతులో పరికరాలు పట్టుకోవాల్సిన పని తప్పుతుంది. అయితే, ఈ కార్లు చాలా ఖరీదైనవి. సామాన్యులకు అందుబాటులో ఉండవు. అయితే, ఓ వ్యక్తి మాత్రం తనకు కావాల్సిన ఎంటర్‌టైన్మెంట్ కోసం ఓ వినూత్న ఐడియాను అమల్లో పెట్టాడు.
Viral: ఇన్ఫీ నారాయణ మూర్తిని మించిపోయిన ఎల్ అండ్ టీ చైర్మన్! వారానికి 90 గంటలు పనిచేయాలంటూ పిలుపు
కారు వెనక సీట్లో ఉన్న వాళ్లకు కనబడే విధంగా ముందు సీటుకు ఓ స్క్రీన్ అమర్చాలనుకున్నాడు. అయితే, ఇందుకు కోసం అతడు ఖరీదైన ఎక్విప్‌మెంట్ ఏదీ కొనకుండానే అనుకున్నది సాధించాడు. తొలుత ఓ ఫోల్డర్ కవర్‌ను ముందు సీటు హెడ్‌రెస్టు అడుగు భాగం నుంచి వేళాడేవిధంగా తగిలించాడు. ఆ తరువాత ఫోల్డర్‌లో తన ట్యాబ్లెట్ పెట్టాడు. తద్వారా వెనకసీట్లో కూర్చు్న్న వారు జర్నీలో ఉన్నప్పుడు టైం పాస్ అయ్యేలా సులువుగా మూవీలు, వీడియోలు చూసేలా ట్యాబ్‌ను ఏర్పాటు చేశాడు. పాలిథీన్ కవర్‌లో ఉన్నా టచ్ స్క్రీన్ పనిచేయడం ఈ వీడియోలో కొసమెరుపు.
Tuna: మోటర్‌సైకిల్ సైజులో ఉన్న చేప వేలం.. ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిన వైనం
కాగా, ఈ వీడియోపై స్పందించిన ఆనంద్ మహీంద్రా వీడియోలోని వ్యక్తి తెలివితేటలు చూసి ఆశ్చర్యపోయారు. ఇలాంటి చిట్కాలు, కిటుకుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భారతీయులను మించిపోయేలా ఉన్నారని కామెంట్ చేశారు. ఈ పోస్టుకు నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. అనేక మంది ప్రశంసలు కురిపించారు. చాలా సులువుగా సమస్యను అతడు పరిష్కరించాడని అన్నారు. కొందరు మాత్రం ఎప్పటిలాగే పెదవి విరించారు. చిట్కాలతో రోజులు నెట్టుకు రావడం మానుకోవాలని, సమస్యలకు అసలైన శాశ్వతమైన పరిష్కారాలు కనుగొంటేనే దేశ భవితకు భరోసా లభిస్తుందని అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
Viral: వేలంలో రూ.56 లక్షలకు అమ్ముడుపోయిన రూ.100 హజ్ నోటు’