Viral Video: అవునా.. జంతువులు కూడా ఆత్మహత్య చేసుకుంటాయా? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో చూస్తే..
ABN , Publish Date - Jan 05 , 2025 | 08:33 PM
మనుషులే కాదు.. జంతువులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాయా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే చాలా మందికి అదే అనుమానం వస్తోంది. మంటల్లోకి వెళ్లి కాలిపోయేందుకు రెండు మేకలు ప్రయత్నిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆనందం, విషాధం, డిప్రెషన్, ఒత్తిడి మొదలైన భావోద్వేగాలను మనుషులే అనుభవిస్తారు. కొందరు డిప్రెషన్‌లోకి వెళ్లిపోయి ఆత్మహత్మలు కూడా చేసుకుంటారు. అయితే మనుషులే కాదు.. జంతువులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటాయా? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే చాలా మందికి అదే అనుమానం వస్తోంది. మంటల్లోకి (Fire) వెళ్లి కాలిపోయేందుకు రెండు మేకలు (Goats) ప్రయత్నిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసిన జనాలు ఆశ్చర్యానికి గురవుతున్నారు (Viral Video).
@RestrictedReels అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోను ఏదో ఒక శీతల దేశంలో చిత్రీకరించినట్టు తెలుస్తోంది. చలి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నివసించే వారు ఇంట్లోనే చిమ్నీలాంటి దానిన ఏర్పాటు చేసుకుని మంట పెట్టుకుంటారు. దాని వల్ల ఇల్లంతా వెచ్చగా మారుతుంది. అలాంటి ఒక ఇంట్లో ఉన్న చిమ్మీలో మండుతున్న మంటలోకి ఓ మేక దూకడానికి ప్రయత్నించింది. అప్పడు ఓ వ్యక్తి దాని కాలు పట్టుకుని బయటకు లాగాడు. అయినా ఆ మేక అతడి నుంచి తప్పించుకుని మంటల్లోకి వెళ్లిపోయింది. ఆ వ్యక్తి దానిని మళ్లీ బయటకు లాగి పంపించేశాడు.
ఆ తర్వాత మేక పిల్ల ఆ మంటల్లోకి దూకడానికి ప్రయత్నించింది. దానిని కూడా ఆ వ్యక్తి బయటకు లాగా కాపాడాడు. ఆ ఘటన మొత్తాన్ని ఓ వ్యక్తి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 1.53 కోట్ల మంది వీక్షించారు. 71 వేల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``మేకలు మంటలకు భయపడవు`` అని చాలా మంది కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
Viral News: ఏడడుగులు వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..
Viral Video: అమ్మా.. వస్తున్నా ఆగు.. తల్లిపై సింహం పిల్ల ఎలా కోపం ప్రదర్శిస్తోందో చూడండి..
Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి