Viral Video: ఇతడి టేస్ట్‌కు సలాం కొట్టాల్సిందే.. టీతో ఎవరైనా దానిని తింటారా? వీడియో చూస్తే..
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:37 PM
ఒక్కొక్కరికి ఒక్కో ఆహారం, ఒక్కో రుచి ఇష్టం. ముఖ్యంగా మన దేశంలో చాలా మంది టీ తాగుతుంటారు. టీతోపాటు కొందరు సమోసా లేదా పకోడీ వంటి స్నాక్స్ తింటుంటారు. మరికొందరు బిస్కెట్లు లేదా రస్కులు తీసుకుంటారు. అయితే వెరైటీగా ఆలోచించే కొందరు మాత్రం టీతో విభిన్న ఆహార పదార్థాలను తీసుకుంటారు.
పుర్రెకో బుద్ధి.. జిహ్వకో రుచి. ఈ ప్రపంచంలో ఎన్నో రుచులు ఉన్నాయి. వాటిని ఆస్వాదించే కోట్ల మంది ప్రజలున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో ఆహారం, ఒక్కో రుచి (Taste) ఇష్టం. ముఖ్యంగా మన దేశంలో చాలా మంది టీ (Tea) తాగుతుంటారు. టీతోపాటు కొందరు సమోసా లేదా పకోడీ వంటి స్నాక్స్ తింటుంటారు. మరికొందరు బిస్కెట్లు లేదా రస్కులు తీసుకుంటారు. అయితే వెరైటీగా ఆలోచించే కొందరు మాత్రం టీతో విభిన్న ఆహార పదార్థాలను తీసుకుంటారు. ప్రస్తుతం అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).
altu.faltu అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి తన ఇంటి మెట్ల మీద కూర్చుని చక్కగా టీ తాగుతున్నాడు. అయితే టీ తాగుతూ మధ్యలో పచ్చి కాలీఫ్లవర్ (cauliflower) తింటున్నాడు. పచ్చి కాలీఫ్లవర్ తింటే ఎలా ఉంటుందో చాలా మందికి తెలిసిందే. ఇక, టీతో పాటు దానిని తినడమంటే అది మామూలు విషయం కాదు. అతడిని చూస్తుంటే ఎంతో ఇష్టంగానే టీతో పాటు కాలీఫ్లవర్ తింటున్నట్టు కనిపిస్తోంది. ఆ వెరైటీ తిండిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ వీడియోను లక్ష మంది వీక్షించారు. వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై చాలా మంది ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఇది చాలా విచిత్రమైన కాంబినేషన్``, ``అతడు టీ పరువు మొత్తం తీసేశాడు``, ``అలా తిన్న తర్వాత అతడు బాగానే ఉన్నాడా``, ``వామ్మో.. ఇలాంటి మనుషులు కూడా మన దేశంలో ఉన్నారా``, ``ఇది ఆరోగ్యం కోసం తింటున్నాడేమో``, ``అలా తినడం వల్ల స్వర్గ ప్రాప్తి వస్తుందన్నా నేను తినను`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral News: ఏడడుగులు వేసే ముందు బాత్రూమ్‌కు వెళ్లిన వధువు.. ఎంతకీ తిరిగి రాకపోవడంతో..
Viral Video: అమ్మా.. వస్తున్నా ఆగు.. తల్లిపై సింహం పిల్ల ఎలా కోపం ప్రదర్శిస్తోందో చూడండి..
Brain Teaser Test: మీరు బాగా అనలైజ్ చేస్తారా? అయితే ఈ ముగ్గురిలో దొంగ ఎవరో 7 సెకెన్లలో గుర్తించండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి