Viral: క్విక్ కామర్స్ సంస్థలకు మేనేజ్‌మెంట్ విద్యార్థిని పరీక్ష! మూడు యాప్స్‌లో ఒకేసారి ఆర్డర్ పెడితే..
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:21 PM
క్విక్ కామార్స్ సంస్థల్లో ఏది ముందు వస్తువులను డెలివరీ చేస్తాయో తెలుసుకునేందుకు ఐఎస్‌బీ విద్యార్థిని పరీక్ష పెట్టారు. ఈ పోటీ తాలూకు ఫలితాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇంటర్నెట్ డెస్క్: క్విక్ కామర్స్ అందుబాటులోకి వచ్చాక జనాల ఆలోచనల్లో మార్పులు వచ్చేశాయి. ఇప్పుడు అందరూ ఇంట్లో కూర్చునే పచారీ సామాన్లు మొదలు కావాల్సినవన్నీ ఆర్డర్ పెడుతున్నారు. 15 నిమషాల్లోనే వస్తువులు ఇంటి ముందు వాలిపోతుండటంతో క్విక్ కామర్స్‌కు గిరాకీ బాగా పెరుగుతోంది. ఇక సంస్థలు కూడా తామే వేగంగా డెలివరీ చేస్తామంటూ ప్రకటనలతో ఊదరగొడుతుంటాయి. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ ఇలా అన్నీ 10-15 నిమిషాల్లోపు వస్తువులు డెలివరీ చేస్తామని చెబున్నాయి. వీటిల్లో ఏది అన్నింటికంటే ఫాస్టో తేలుద్దామని ఓ మేనేజ్‌మెంట్ విద్యార్థిని రంగంలోకి దిగింది (Viral).
Viral: వేలంలో రూ.56 లక్షలకు అమ్ముడుపోయిన రూ.100 ‘హజ్ నోటు’
ఐఎస్‌బీలో చదువుతున్న మేనేజ్‌మెంట్ విద్యార్థిని స్నేహ ఈ పరీక్షకు తెరలేపారు. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బ్లింకిట్‌లో ఒకేసారి వివిధ వస్తువులను ఆర్డర్ పెట్టారు. ఈ క్రమంలో తాము 15 నిమిషాల్లో డెలివరీ చేస్తామని బ్లింకిట్ పేర్కొంది. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ 21 నిమిషాలు, జెప్టో 8 నిమిషాల టైం చెప్పాయి.
కానీ, ఈ పోటీలో తుదకు బ్లింకిట్ గెలిచింది. అందరికంటే ముందుగా బ్లింకిట్ కేవలం 15 నిమిషాల్లో ప్రొటీన్ బార్లను డెలివరీ చేసింది. చెప్పిన సమయానికంటే కేవలం 2 నిమిషాలు లేటుగా బార్‌లను ఇచ్చింది. ఇక రెండో స్థానంలో నిలిచిన స్విగ్గీ ఇన్‌స్టామార్ట్ ఏజెంట్ పాల ప్యాకెట్‌ను 21 నిమిషాల్లో ఇచ్చి వెళ్లాడు. చిట్టచివరగా జెప్టో డెలివరీ ఏజెంట్ వచ్చారు. జెప్టోలో పనీర్ తెప్పించుకునేందుకు ఏకంగా రూ.30 నిమిషాలు పట్టింది. కానీ యాప్‌లో మాత్రం 8 నిమిషాల్లోనే వస్తువు ఇంటికి వస్తుందని చెప్పడం కొసమెరుపు.
Tuna: మోటర్‌సైకిల్ సైజులో ఉన్న చేప వేలం.. ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిన వైనం
కాగా, జెప్టో డెలివరీ ఏజెంట్‌తో స్నేహ ఆలస్యం కావడానికి గల కారణంపై చర్చింది. క్యాంపస్‌లోపల లోకేషన్‌ను కనుక్కోవడంలో కాస్త తడబాటుకు గురికావడంతో ఆలస్యమైందని సదరు ఏజెంట్ చెప్పుకొచ్చారు. ఈ ఫలితాలపై మరో పోస్టు పెట్టిన స్నేహ తనకు ఎటువంటి దురుద్దేశమూ లేదని కూడా స్పష్టం చేసింది. ముందుగా ఎవరు వస్తువులను డెలివరీ చేస్తారో తెలుసుకోవాలనే కుతూహలంతో ఈ పోటీ పెట్టినట్టు వివరించింది. వస్తువులు ఎంత త్వరగా ఇంటికి వస్తాయనేది వారి డిస్ట్రిబ్యుషన్ సెంటర్ ఎంత దూరంలో ఉందనేదానిపై కూడా ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..