Share News

Viral News: ఆమెకు 60, అతనికి 30.. వీరి ప్రేమ కథ తెలిస్తే షాక్ అవుతారు..

ABN , Publish Date - Jan 28 , 2025 | 12:35 PM

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ బజ్రియా పోలీస్ స్టేషన్ పరిధిలో పూల వ్యాపారం చేసుకుంటూ ఓ వృద్ధ జంట జీవిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా.. ఓ కుమారుడికి పెళ్లై పిల్లులు కూడా పుట్టారు. బామ్మ వయసున్న మహిళతో స్థానికంగా ఉంటున్న ఓ యువకుడిని పరిచయం ఏర్పడింది.

Viral News: ఆమెకు 60, అతనికి 30.. వీరి ప్రేమ కథ తెలిస్తే షాక్ అవుతారు..
Kanpur love story

కాన్పూర్: ప్రేమకు వయసుతో సంబంధం లేదంటారు. ప్రేమ అనేది ఎప్పుడైనా, ఎవరిపైనైనా పుట్టేస్తోంది. వయసుతో సంబంధ లేకుండా అనేక మంది పెళ్లిళ్లు సైతం చేసుకున్నారు. సోషల్ మీడియా పరిచయాలతో ఓ వృద్ధుడిని యువతి పెళ్లికోగా, మరో పండు ముసలి వ్యక్తిని ఓ మహిళ పరిణయమాడింది. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ సైతం తనకంటే ఐదేళ్లు పెద్దవయసున్న మహిళను వివాహం చేసుకున్నారు. ఇలా చెప్పుకుంటూపోతే అనేక ఘటనలు కనిపిస్తాయి. అయితే తాజాగా ఇద్దరి ప్రేమ వ్యవహారం వైరల్‌గా మారింది. వారి ప్రేమ కథ విని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఇద్దరూ పారిపోవడంతో వారి ప్రేమ కథపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.


ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో తన భార్య కనిపించడం లేదని బజ్రియా పోలీసులను ఓ వ్యక్తి ఆశ్రయించాడు. ఇందులో కొత్తేముందని అనుకుంటున్నారా? అక్కడే ఉంది ట్విస్ట్. తన భార్యకు 60 ఏళ్లని ఆమె 30 ఏళ్ల వయసున్న యువకుడితో పారిపోయిందంటూ ఆ వృద్ధుడు పోలీసులకు తెలిపాడు. వారిని పట్టుకోవాలని, తన భార్యను తిరిగి తీసుకురావాలంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వృద్ధుడి మాటలు విని పోలీసులు అవాక్కయ్యారు.


అసలు విషయం ఏంటంటే.. కాన్పూర్ బజ్రియా పోలీస్ స్టేషన్ పరిధిలో పూల వ్యాపారం చేసుకుంటూ ఓ వృద్ధ జంట జీవిస్తున్నారు. వారికి ముగ్గురు పిల్లలు కాగా.. ఓ కుమారుడికి పెళ్లై పిల్లులు కూడా పుట్టారు. బామ్మ వయసున్న మహిళతో స్థానికంగా ఉంటున్న ఓ యువకుడిని పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి ముదిరింది. సమాజం ఏమనుకున్నా పర్వాలేదు.. తాము మాత్రం కలిసే జీవించాలని అనుకున్నారు ఆ ప్రేమికులు. అనంతరం ఇంటి నుంచి పారిపోయారు. ఆ బామ్మ 8 ఏళ్ల క్రితం కూడా ఓ యువకుడితో లేచిపోయినట్లు ఆమె భర్త తాజాగా పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం మరో యువకుడితోనూ పారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె తరచూ ఇలాంటి పనులు చేస్తూ పరువు తీస్తోందంటూ బోరున విలపించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బామ్మ, ఆమె ప్రియుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Viral News: మరో ఘోరం.. భార్య వేధింపులు తాళలేక భర్త ఏం చేశాడంటే..

Viral Video: ఇందులో తప్పెవరిది.. రోడ్డు దాటుతున్న వ్యక్తి.. బైకుపై వచ్చి చెంపదెబ్బ కొట్టిన పోలీస్.. చివరకు చూస్తే..

Updated Date - Jan 28 , 2025 | 01:25 PM