Viral: స్కూల్ రోజుల్లో నాటకంలో భార్యాభర్తలుగా నటించి.. 20 ఏళ్ల తరువాత ఊహించని విధంగా..
ABN , Publish Date - Jan 21 , 2025 | 04:28 PM
స్కూలు రోజుల్లో వేసిన నాటకంలో భార్యాభర్తలుగా నటించిన ఇద్దరు చిన్నారులు 20 ఏళ్ల తరువాత వివాహబంధంలో ఒక్కటయ్యారు. చిన్నతనంలో దూరమైన వారు ఇన్నేళ్ల తరువాత భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు.

ఇంటర్నెట్ డెస్క్: ఆ ఇద్దరు చిన్నారులు కిండర్‌గార్టెన్‌లో ఉండగా స్కూలు నాటకంలో భార్యాభర్తలుగా నటించారు. ఆ తరువాత స్కూళ్లు మారడంతో ఆ విషయమే మర్చిపోయారు. కానీ 20 ఏళ్ల తరువాత అదే జంట అనూహ్య పరిస్థితుల్లో కలుసుకుని ప్రేమలో పడ్డారు. చివరకు నిజజీవితంలో భార్యాభర్తలు కొత్త జీవితం ప్రారంభించారు. చైనాలో వెలుగు చూసిన ఈ వింత లవ్ స్టోరీ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. జనాలు షాకైపోయేలా చేస్తోంది (Viral).
Viral: గంటకు 282 కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైలుకు వేళాడుతూ ప్రయాణం! తృటిలో తప్పిన ప్రమాదం!
చైనా మీడియా కథనాల ప్రకారం, జెంగ్, అతడి గర్ల్‌ఫ్రెండ్‌కు జనవరి 7న వివాహం జరిగింది. వేడుక సందర్భంగా అతిథులు, బంధువుల కోసం ప్లే చేసిన ఓ వీడియో అందరినీ అమితంగా ఆశ్చర్యపరిచింది. అది ఆ నూతన దంపతుల చిన్ననాటి వీడియో. అప్పట్లో స్కూల్లో జరిగిన ఓ వేడుక సందర్భంగా చిన్న నాటకం వేసిన ఆ చిన్నారులు అందులో భార్యాభర్తలుగా నటించారు. తెల్లని గౌనులో వచ్చిరానీ మాటలతో బాలిక మురిపించగా, చిన్న కోటు ధరించి బాలుడు కూడా తన పాత్ర అద్భుతంగా పోషించి తల్లిదండ్రులు, టీచర్లను మెప్పించాడు.
ఆ తరువాత పిల్లలిద్దరూ స్కూలు మారిపోయారు. వారి దారులు తాత్కాలికంగా వేరయ్యాయి. ఒకరిగురించి మరొకరు పూర్తిగా మరిచిపోయారు. సీన్ కట్ చేస్తే 2022లో జెంగ్ చిన్ననాటి స్నేహితులు ఓ చోట కలుసుకున్నారు. అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. జెంగ్ వేసిన నాటకం తాలూకు వీడియోను వీడియోకు అందరూ కలిసి చూశారు. ఆ వీడియో జెంగ్ తల్లి కూడా చూసి మురిసిపోయింది. అయితే, జెంగ్‌కు అప్పటికి ఇంకా వివాహం కాలేదు. తన బిడ్డ ఒంటరిగా ఉన్నందుకు తల్లి కూడా బెంగపడింది. ఈ క్రమంలో స్కూలు నాటకం వీడియో చూశాక ఆమెకు ఓ అద్భుతమై ఐడియా మెరిసింది. నాటకంలో జెంగ్‌కు జోడీగా నటించిన బాలిక ఇప్పుడు ఏం చేస్తోందో కనుక్కోమని కుమారుడికి చెప్పింది.
Viral: టిక్కెట్‌కు చిల్లర ఉన్నా ఇవ్వని రైల్వే ఉద్యోగి.. ప్యాసెంజర్ గుస్సా.. వీడియో వైరల్
ఈ ఐడియా జెంగ్‌కు కూడా నచ్చడంతో ఆమె జాడ వెతికిపట్టుకున్నాడు. అప్పటి తన టీచర్‌ను కలిసి ఆమె సాయంతో తన చిన్ననాటి స్నేహితురాలి అడ్రస్ తెలుసుకుని వెళ్లాడు. అప్పటికి ఆమె కూడా సింగిల్‌యే. దీంతో, ఒకరికొకరు తొలి చూపులోనే నచ్చేశారు. డేటింగ్ ప్రారంభించారు. మరో ఏడాది తిరిగేసరికి ఒకరిని విడిచి మరొకరు ఉండలేని స్థితికి చేరుకున్నారు. అలా.. భార్యాభర్తలుగా కొత్త జీవితం ప్రారంభించారు.
ఇక ఈ ఉదంతం సోషల్ మీడియా బాటపట్టడంతో జనాలు ఆశ్చర్యపోతున్నారు. ఈ లవ్ స్టోరీకి స్క్రీప్ట్ దేవుడు రాశాడంటూ కామెంట్ చేస్తున్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ వైరల్ అవుతోంది.
Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో