Share News

Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత

ABN , Publish Date - Jan 05 , 2025 | 09:25 PM

చిరుతకు ఓ జింక బలవగా ఈ దృశ్యాల్ని చూసిన మరో 7 జింకలు షాక్‌తో కన్నుమూశాయి. గుజరాత్‌లో ఈ ఘటన వెలుగు చూసింది.

Viral: చిరుత వేటకు జింక బలి.. షాక్‌లో మరో 7 జింకల మృత్యువాత

ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం సమీపంలోని జంగల్ సఫారీ పార్క్‌లోకి చొరబడ్డ ఓ చిరుత కృష్ణ జింకను మట్టుపెట్టింది. ఈ భయానక దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన మరో ఏడు జింకలు తీవ్ర షాక్‌కు గురై కన్నుమూశాయి. జనవరి 1న ఉదయం ఈ ఘటన జరిగింది. దీంతో, అసలేం జరిగిందో తెలుసుకునేందుకు స్థానిక అటవీ శాఖ దర్యాప్తునకు ఆదేశించింది (Viral).

అటవీ శాఖ అధికారుల ప్రకారం, రెండు నుంచి మూడేళ్ల వయసున్న ఓ చిరుత ఉద్యానవనం కంచెను దాటుకుని లోపలికి ప్రవేశించింది. ఐక్యతా విగ్రహానికి సమీపంలో ఉన్న ఈ పార్కును సందర్శించేందుకు పర్యాటకులు అధిగసంఖ్యలో వస్తుంటారు. చుట్టూ శూల్‌పాణేశ్వర్ వన్యప్రాణి అభయారణ్యం ఉండటంతో ఈ పార్కు పచ్చదనంతో కళకళలాడుతూ పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంటుంది.


Viral: రిస్క్ అని తెలిసీ క్యాండీని గట్టిగా కొరికి దవడ విరగ్గొట్టుకున్న యువతి

ఇదిలా ఉంటే.. చిరుత జింకలు ఉన్న ప్రాంతంలోకి కంచె దాటుకుని చొరబడి ఓ కృష్ణ జింకను పొట్టనపెట్టుకుంది. ఈ దృశ్యాలను ప్రత్యక్షంగా చూసిన ఇతర జింకలు తీవ్ర షాక్‌కు మరణించాయి. మొత్తం ఎనిమిది కళేబరాలకు పోస్ట్ మార్టం నిర్వహించి దహనం చేశామని అటవీ శాఖ అధికారులు తెలిపారు

ఈ పార్కు పరిశరాల్లో చిరుత కనిపించడం సాధారణమేనని డిప్యుటీ కన్సర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ పేర్కొన్నారు. అయితే, ఓ చిరుత సఫారీ పార్కులోకి ప్రవేశించడం ఇదే తొలిసారని చెప్పారు. పార్క్‌లో పటిఘా ఏర్పాట్లు ఉన్నాయని, 400 సీసీటీవీ కెమెరాలతో అక్కడ జరుగుతోందేంటో గమనిస్తుంటామని చెప్పారు.

వామ్మో.. పులి పిల్లల వేట.. షాకింగ్ వీడియో!


చిరుత సంచారం గుర్తించగానే భద్రతా అధికారులు అప్రమత్తమై అక్కడికి చేరుకోవడంతో చిరుత పరారైందని చెప్పారు. అయితే, సఫారీ పార్కు నుంచి చిరుత పూర్తిగా వెళ్లిపోయిందా లేదా అనేదాని మీద ఇంకా స్పష్టత లేదని వివరించారు.

కాగా, ఘటన నేపథ్యంలో అధికారులు పార్కును 48 గంటల పాటు మూసేశారు. అనంతరం జనవరి 3న మళ్లీ తెరిచారు. అయితే, చిరుత మళ్లీ తిరిగిరావొచ్చన్న భయాలు మాత్రం స్థానికుల్లో పూర్తిగా తొలగిపోలేదు.

వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్

ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న

Read Latest and Viral News

Updated Date - Jan 05 , 2025 | 09:25 PM