Share News

Viral: నీళ్లల్లోకి దిగిన సింహం! వెనక నుంచి దాడి చేసిన మొసలి! చివరకు..

ABN , Publish Date - Jan 03 , 2025 | 01:52 PM

మొసలి నోటికి చిక్కి నీటి అడుగుకు వెళ్లిన ఓ సింహం ఆ మరుక్షణమే ఆశ్చర్యకరంగా బయటకు వచ్చిన ఉదంతం ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ వీడియోను చూసి జనాలు షాకైపోతున్నారు.

Viral: నీళ్లల్లోకి దిగిన సింహం! వెనక నుంచి దాడి చేసిన మొసలి! చివరకు..

ఇంటర్నెట్ డెస్క్: నీటిలోని మొసలి నిగిడి యేనుగు పట్టు.. అన్న పద్యం స్థానబలాన్ని కళ్లకుకట్టినట్టు వర్ణిస్తుంది. అయితే, ఇది అన్నివేళలా నిజం కాదనే వృత్తాంతాలు కూడా ప్రకృతిలో వెలుగు చూస్తుంటాయి. ఎంత నీటిలో ఉన్నా కూడా మొసలి తను తలుచుకున్న వెంటనే జంతువులను వేటాడలేదు. ముఖ్యంగా ఎదురుతిరిగే లక్షణం పుష్కలంగా ఉన్న సింహాలు నీటిలోనూ పోరాడగలవు. ఇందుకు తాజా ఉదాహరణగా ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసి ప్రస్తుతం జనాలు ఆశ్చర్యపోతున్నారు (Viral).

Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్


వీడియోలో కనిపించిన దాని ప్రకారం, తొలుత ఓ సింహం నది దాటేందుకు నీళ్లల్లోకి దిగింది. కొంత అనుమానపడినా కూడా ధైర్యం చేసి ఈత ప్రారంభించింది. కొన్ని అడుగుల దూరం వెళ్లిందో లేదో వెంటనే ఓ మొసలి కన్ను దానిపై పడింది. సింహం వెనకాలే చప్పుడు చేయకుండా ఈదుతూ వచ్చిన మొసలి ఒక్కసారిగా దాని వీపును నోట కరిచి నీళ్లల్లోకి లాగేసింది. ఇదంతా వీడియోలో రికార్డు చేస్తున్న మహిళ షాకైపోయింది. సింహానికి మరణం తప్పదని భయపడిపోతూ నిట్టూర్చింది. మరి నీళ్లల్లోపల ఏ పోరాటం జరిగిందో కానీ కొన్ని సెకెన్ల తరువాత సింహం నీటిపైకి రాగా దాన్ని విడిచిపెట్టిన మొసలి కూడా మరో ఆలోచన లేకుండా వెనక్కు మళ్లింది. సాధారణంగా నీళ్లల్లో జంతువును మట్టుపెట్టడంలో మొసళ్లు ఓసారి విఫలమైతే మళ్లీ ప్రయత్నిస్తాయి. కానీ ఈ ఉదంతంలో మాత్రం మొసలి రెండో ప్రయత్నం చేయకుండానే వెనుదిరిగింది.

Viral: బాస్మతీ రైస్ బ్యాగుతో షాపింగ్‌కు వచ్చిన అమెరికా ధనవంతురాలు.. షాక్‌లో జనాలు!


ఇక వీడియో నెట్టింట తెగ ట్రెండవుతుండటంతో లక్షల కొద్దీ వ్యూస్ వచ్చిపడుతున్నాయి. నీటిలో ఉన్నా సింహం సింహమే అని కొందరు కామెంట్ చేశారు. సింహం ఎదురు తిరిగే సరికి నీటిలోని మొసలికి గట్టి షాక్ తగిలిందని అన్నారు. సింహాన్ని మృగరాజు అని ఇందుకే అంటారని కొందరు చెప్పుకొచ్చారు. సింహంపై దాడి చేయడం పొరపాటని గ్రహించి మొసలి వెనక్కు తగ్గి ఉంటుందని మరికొందరు చెప్పుకొచ్చారు. ‘‘మొసలి నోట చిక్కాక ఓ జీవి తప్పించుకోవడం ఎప్పుడూ చూడలేదు. నీటిలోపల ఏదో అద్భుతం జరిగే ఉంటుంది’’ అని మరో వ్యక్తి అన్నారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.

Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్

Read Latest and Viral News

Updated Date - Jan 03 , 2025 | 01:56 PM