Share News

Liquor Mixing : మందులోకి కూల్‌డ్రింక్ బెటరా.. వాటర్ బెటరా..

ABN , Publish Date - Mar 26 , 2025 | 03:39 PM

Liquor Mixing: మందుబాబులు.. మందులో ఏదీ కలుపుకొన్న.. తాగడం మాత్రం తమ కిం కర్తవ్యమన్నట్లుగా తాగేస్తారు. మరి మందులోకి కూల్ డ్రింక్ కలుపుకొని తాగడం బెటరా? లేకుంటే.. మంచి నీరు కలుపుకొని తాగడం సురక్షితమా? అంటే.. ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

Liquor Mixing : మందులోకి కూల్‌డ్రింక్ బెటరా.. వాటర్ బెటరా..

విస్కీ తాగిన వాడు విష్ణు మూర్తి కొడుకు. సారా తాగిన వాడు సాంబమూర్తి కొడుకు, బ్రాందీ తాగిన వాడు బ్రహ్మ దేవుడి కొడుకు. ఏమి తాగని వాడు వెధవ నా.. అని ఓ సినిమా కవి తాగుబోతులకు కాస్తా ఆధ్యాత్మికతను జోడించి మరి చెప్పాడు. విస్కీ, సారా, బ్రాందీ.. ఏదీ తాగినా.. అందులో కూల్ డ్రింకో, నీళ్లో కలుపుకొని తాగుతారన్నది మాత్రం వాస్తవం. మరి ఈ రెండింటింలో ఏది మంచిది.. ఏది నష్టం అనేది ఓ సారి పరిశీలిస్తే.. కూల్ డ్రింక్ కలపడం వల్ల లాభమా? నష్టమా?.. మందులో కూల్ డ్రింక్ కలపడం వల్ల రుచి పెంచుతుంది. చక్కెర, కార్పోనేషన్ ఆల్కహాల్ కఠినతను తగ్గిస్తుంది. అందువల్ల సులభంగా వీటిని తాగవచ్చు.

ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. రమ్, కోక్ లేదా వోడ్కా విత్ స్ప్రైట్ లాంటివి ప్రసిద్ధిగాంచాయి. కానీ ఆరోగ్యం దృష్ట్యా ఇవి చాలా ప్రమాదకరమని అంటున్నారు. ఎందుకంటే.. కూల్ డ్రింక్‌లో చక్కెర 330 మి.లీ, కోక్‌లో 35 గ్రాముల చక్కెర ఉంటాయి. ఇవి కేలరీలను పెంచుతోంది. మందులో కూల్ డ్రింక్ కలిపి తీసుకోవడం వల్ల.. ఊబకాయం, డయాబెటిస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంది. ఇక అధ్యయనాల ప్రకారం.. చక్కెర, ఆల్కహాల్ శోషణను వేగవంతం చేస్తుంది. దీని వల్ల అధికంగా తాగే అవకాశం ఉంటుంది.


నీళ్లు కలపడం వల్ల.. మందులో నీళ్లు కలిపి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతోంది. ఆల్కహాల్ డీహైడ్రేషన్‌కు కారణమవుతోంది. కానీ నీరు దాని ప్రభావాన్ని తగ్గిస్తోంది. ఇది ఆల్కహాల్ సాంద్రతను తగ్గించి.. శరీరంపై ప్రభావాన్ని నియంత్రిస్తుంది. ఇంకా సోదాహరణగా వివరించాలంటే.. విస్కీలో వాటర్ లేదా వోడ్కాలో నీరు కలిసి తీసుకోవడం వల్ల హ్యాంగోవర్ తక్కువ స్థాయిలో ఉంటుందని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వివరిస్తోంది.


ఏదీ ఉత్తమం.. మందులో కూల్‌డ్రింక్ కలిపి తీసుకోవడం వల్ల రుచి అయితే ఉంటుంది. కానీ ఆరోగ్యం త్వరగా దెబ్బ తినే అవకాశముంది. అదే నీరు కలిపి తీసుకోవడం వల్ల కొంతలో కొంత మేలు జరుగుతోంది. అదీకాక కూల్ డ్రింక్‌లో మందు కలిపి తాగడం వల్ల.. మందు ఎక్కువగా తాగే ప్రమాదం ఉంది. ఇది కిడ్నీలతోపాటు లివర్‌పై ఒత్తిడి పెంచుతొందని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అదే నీరుతో కలిపి తీసుకుంటే పలు సమస్యలను తగ్గిస్తోంది.


అంతేకాకుండా.. మితంగా తాగేలా చేస్తుంది. ఇక బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రకారం.. ఆల్కహాల్‌తో నీరు కలపడం హ్యాంగోవర్‌ను 20 శాతం వరకు తగ్గిస్తోంది. మందుని కూల్ డ్రింక్‌లో కలిపి తీసుకోవడం వల్ల.. తాత్కాలిక ఆనందం ఇస్తుంది. కానీ దీర్ఘ కాలిక ఆరోగ్యానికి మాత్రం నీరు ఉత్తమం. ఎక్కువ తాగకుండా..ఒక పరిమితి విధించుకొని తాగితే.. అందులోనూ నీటిని కలిపి తీసుకుంటే.. ఆరోగ్యం అదుపులో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Updated Date - Mar 26 , 2025 | 03:46 PM