Share News

Long Weekends: ఈ ఏడాది వారికి పండగే పండగ.. అస్సలు మిస్సవద్దు

ABN , Publish Date - Jan 01 , 2025 | 02:14 PM

Long weekends: ప్రతీ నెలలో పండుగలతో పాటు శనివారం, ఆదివారాలు కలిసి సుదీర్ఘ సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కడికైనా వెళ్లాలనుకునే వారు ఈ తేదీల్లో తమ టూర్‌ను ప్లాన్‌ చేసుకోవచ్చు. పండుగలకు ఒకరోజు ముందో లేక.. ఆ తరువాత సెలవు తీసుకుంటే.. ఆపై వచ్చే శని, ఆదివారాలతో లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేసుకోవచ్చు.

Long Weekends: ఈ ఏడాది వారికి పండగే పండగ.. అస్సలు మిస్సవద్దు
Long weekent list

చాలా మందికి టూర్‌లకు వెళ్లడం అంటే సరదా. ప్రతీరోజూ ఉద్యోగం ఒత్తిడిలో తలమొనకలైన వారు... కొద్ది రోజుల పాటు హ్యాపీగా లైఫ్‌ను ఎంజాయ్ చేయాలని భావిస్తుంటారు. అందుకోసం ఎక్కడికైనా లాంగ్ టూర్‌‌కు వెళ్లాలని ప్లాన్ చేస్తుంటారు. అయితే అన్ని రోజులు సెలవులు తీసుకుంటే ఉద్యోగం చేసే చోట ఇబ్బందులు తప్పవు. అలాగే పిల్లలు కూడా స్కూళ్లకు డుమ్మా కొట్టడంతో చదువుల్లో వెనకబడే అవకాశం ఉంటుంది. అలాంటి వారికి ఈ ఏడాది లాంగ్ వీకెండ్‌లు బాగా కలిసొచ్చాయనే చెప్పుకోవచ్చు. 2025లో లాంగ్‌ వీకెండ్‌లు బాగానే ఉన్నాయి. ప్రతీ నెలలో పండుగలతో పాటు శనివారం, ఆదివారాలు కలిసి సుదీర్ఘ సెలవులు వచ్చాయి. దీంతో ఎక్కడికైనా వెళ్లాలనుకునే వారు ఈ తేదీల్లో తమ టూర్‌ను ప్లాన్‌ చేసుకోవచ్చు. పండుగలకు ఒకరోజు ముందో లేక.. ఆ తరువాత సెలవు తీసుకుంటే.. ఆపై వచ్చే శని, ఆదివారాలతో లాంగ్ వీకెండ్‌ను ఎంజాయ్ చేసుకోవచ్చు. సెలవులను బట్టి ఎంత దూరం వెళ్లాలో ముందే నిర్ణయించుకోవచ్చు. ఏ ప్రాంతాలకు వెళ్లాలనుకుంటాన్నారో ముందుగా డిసైడ్ చేసుకుని.. ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఎంజాయ్ చేసి వచ్చేయండి. ఈ ఏడాది అక్టోబర్‌లో మాత్రం లాంగ్ వీకెండ్‌ల సంఖ్య ఎక్కువనే చెప్పుకోవచ్చు. 2025 లాంగ్ వీకెండ్ లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతీ నెలలో ఎన్ని సెలవులు వచ్చాయి.. శనివారం, ఆదివారంతో కలిసి వచ్చిన సెలవులు ఎన్నో తెలుసుకుందాం.


  • జనవరిలో మొదటి లాంగ్ వీకెండ్ 11వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. జనవరి 11, 12 తేదీల్లో శనివారం, ఆదివారం సెలవులు ఉన్నాయి. జనవరి 13 (సోమవారం) సెలవు తీసుకుంటే మకర సంక్రాంతి ప్రభుత్వ సెలవులతో జనవరి 14 లాంగ్ వీకెండ్ అవుతుంది.

  • మార్చి నెలలో రెండు లాంగ్ వీకెండ్ సెలవులు ఉన్నాయి. మార్చి 14న హోలీ, మార్చి 15, 16న శని, ఆదివారం సెలవులు ఉన్నాయి. మీరు 13వ తేదీ లీవ్ తీసుకుంటే నాలుగు రోజులు ఎంజాయ్ చేయవచ్చు. మార్చి 29, 30 శని, ఆదివారం. మార్చి 31 ఈద్ అల్-ఫితర్ సెలవుదినం. ఈ తేదీల్లో కూడా టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.

  • ఏప్రిల్‌లో కూడా రెండు లాంగ్ వీకెండ్‌లు కూడా ఉన్నాయి. మొదటిది ఏప్రిల్ 10న మహావీర్ జయంతి, ఏప్రిల్ 11న సెలవు తీసుకుంటే అది ఏప్రిల్ 12, 13వ తేదీలలో శని, ఆదివారంతో లాంగ్ వీకెండ్ అవుతుంది. రెండోది ఏప్రిల్ 18న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 19, 20న శనివారం, ఆదివారం సెలవులు. ఈ మూడు రోజుల పాటు చిన్న ట్రిప్ వేసుకుని వచ్చేయొచ్చు.

  • మేలో ఒక లాంగ్ వీకెండ్ మాత్రమే ఉంది. మే 10, 11 తేదీల్లో శని, ఆదివారాలు సెలవుల నేపథ్యంలో మే 12న బుద్ధ పూర్ణిమకు ప్రభుత్వ సెలవుదినం ఉంది.


  • ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం, ఆగస్టు 16న జన్మాష్టమి (శనివారం), ఆగస్టు 17న ఆదివారం. ఈ మూడు రోజులు తక్కువ దూరం వెళ్లే ప్రాంతాలను ఎంచుకుని ఎంజాయ్ చేసి రావొచ్చు.

  • సెప్టెంబర్ 5న ఈద్-ఎ-మిలాద్, ఓనం ఉన్నాయి. సెప్టెంబర్ 6 శనివారం, సెప్టెంబర్ 7 ఆదివారం కలిసి లాంగ్ వీకెండ్ అవుతాయి. సో ఎంజాయ్ చేసేయండి.

  • అక్టోబర్‌లోనూ లాంగ్ వీకెండ్స్ ఎక్కువే. మహా నవమి, గాంధీ జయంతి అక్టోబర్ 1, 2 తేదీలలో ఉన్నాయి. మీరు అక్టోబర్ 3న సెలవు తీసుకుంటే అక్టోబర్ 4, 5 శని, ఆది వారాలు కలిసి వస్తాయి. ఈ నెల 18, 19, 20వ తేదీల్లో దీపావళి వారాంతం. 23 - 26 అక్టోబర్‌లో భాయ్ దూజ్‌తో మరో లాంగ్ వీకెండ్ కూడా ఉంటుంది.

  • డిసెంబర్‌లో 25న క్రిస్మస్. డిసెంబరు 26న సెలవు తీసుకుంటే 27, 28వ తేదీలు శని, ఆది వారాలు కలిసి లాంగ్ వీకెండ్ అవుతుంది.


ఇవి కూడా చదవండి...

ఆ నెలలో ఉద్యోగస్తులు, విద్యార్థులకు బంపర్ బొనంజా

వామ్మో.. మందు కోసం ఇంతకు తెగిస్తారా

Read Latest Pratyekam News And Telugu News

Updated Date - Jan 01 , 2025 | 02:15 PM