Share News

Viral Video: ఏనుగును చూసి కుక్క మొరిగితే ఏమవుతుంది? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..

ABN , Publish Date - Jan 10 , 2025 | 04:46 PM

కుక్కల అరుపులను ఏనుగు పట్టించుకోదు అంటూ సామెత చెబుతుంటారు. అయితే ఆ కుక్క అరుపులు ఏనుగుకు చిరాకు తెప్పిస్తే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది.

Viral Video: ఏనుగును చూసి కుక్క మొరిగితే ఏమవుతుంది? ఈ వీడియో చూస్తే తెలుస్తుంది..
elephant charging at the dog

రోడ్డు మీద ఏనుగు (Elephant) నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్కలు అరుస్తాయి. ఆ అరుపులను ఏనుగు పట్టించుకోదు అంటూ సామెత చెబుతుంటారు. అయితే ఆ కుక్క (Dog) అరుపులు ఏనుగుకు చిరాకు తెప్పిస్తే మాత్రం పరిస్థితి వేరే విధంగా ఉంటుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాంటిదే ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ కుక్క తన అరుపులతో చిరాకు పెట్టడంతో ఏనుగు ఉగ్రరూపం దాల్చింది. ఆ కుక్కను తరిమింది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత్ నందా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఆ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియో ప్రకారం.. ఓ ఏనుగు రోడ్డు మీద తిరుగున్న సమయంలో ఓ వీధి కుక్క దాని దగ్గరకు వెళ్లి మొరగడం ప్రారంభించింది. మొదట ఏనుగు ఆ కుక్క అరుపులను పట్టించుకోలేదు. అయితే ఆ కుక్క దగ్గర వరకు వెళ్లి అరుస్తుండడంతో ఏనుగుకు చిరాకు వచ్చింది. ముందు దాని వైపు కోపంగా చూసింది. అయినా కుక్క దూరంగా వెళ్లలేదు. దీంతో ఆ ఏనుగు తీవ్ర ఉగ్రరూపం దాల్చి ఆ కుక్క వెనుక పరిగెత్తంది. భయపడిన కుక్క వేగంగా అక్కడి నుంచి పారిపోయింది. ఆ వీడియోను పంచుకున్న సుశాంత్ నందా.. ``కళ్లకే కనుక చంపగలిగే శక్తి ఉంటే.. కుక్క వెనుక పడుతున్నప్పుడు ఏనుగు కోపం చూడండి`` అంటూ కామెంట్ చేశారు.


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మంది కంటే ఎక్కువగా వీక్షించారు. 2.5 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఓ మైగాడ్.. కుక్క దొరికి ఉంటే దాని పని పూర్తవుతుంది``, ``ఏనుగు మీద నుంచి దుమ్ము ఎగురుతున్న తీరు చూస్తుంటే యాక్షన్ హీరో గుర్తుకు వచ్చాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Starbucks: స్టార్‌బక్స్ లోగో ఏంటో తెలుసా? దాని వెనుక ఉన్న ఆసక్తికర కథ ఏంటంటే..


Optical Illusion Test: మీ కళ్లు సూపర్ పవర్‌ఫుల్ అయితే.. ఈ పక్షుల మధ్యనున్న ఊసరవెల్లిని 9 సెకెన్లలో గుర్తించండి..


Viral Video: ఈ ఏనుగు ఎంత మంచిది.. ఎన్‌క్లోజర్‌లో కుర్రాడి చెప్పు పడిపోతే ఏం చేసిందో చూడండి..


Viral Video: వావ్.. ఎలన్ మస్క్‌కు పోటీ ఇచ్చేలా ఉన్నాడు కదా.. నీటి మీద వేగంగా వెళ్తున్న ఈ వాహనాన్ని చూశారా?



మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 10 , 2025 | 04:47 PM