Share News

Viral: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. కలోనిజమో తెలీక బాధితుడికి షాక్!

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:04 PM

విమానంలో నిద్రిస్తున్న వ్యక్తిపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన దారుణ ఉదంతం యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో వెలుగు చూసింది. ఈ దారుణానికి పాల్పడ్డ నిందితుడిపై నిషేధం విధించినట్టు ఎయిర్‌లైన్స్‌ తాజాగా తెలిపింది.

Viral: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. కలోనిజమో తెలీక బాధితుడికి షాక్!

ఇంటర్నెట్ డెస్క్: ఫ్లైట్ జర్నీ అంటే.. ఆకాశంలో ఒంటరి ప్రయాణమని చెప్పకతప్పదు. ఏదైనా సమస్య ఎదురైతే విమానం ల్యాండయ్యే వరకూ శాశ్వత పరిష్కారం లభించదు. ఇలాంటి పరిస్థితుల్లో తొటి ప్రయాణికులుతో కలిగే ఇబ్బందులు నరకం చూపిస్తాయి. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఓ ప్రయాణికుడికి సరిగ్గా ఇదే అనుభవం ఎదురైంది. తోటి ప్రయాణికుడు తనపై మూత్ర విసర్జన చేయడంతో తడిసి దుస్తులతోనే అతడు ఎనిమిది గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చింది. ఈ ఉదంతం ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది (Viral).

బాధితుడు జెరోమ్ గుటెర్రెజ్ కూతురు తెలిపిన వివరాల ప్రకారం, గుటెర్రెజ్ ఇటీవల యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమానంలో శాన్‌ఫ్రాన్‌సిస్కో నుంచి మనీలాకు బయలుదేరారు. మార్గమధ్యంలో ఉండగా తోటి ప్రయాణికుడు ఆయనపై మూత్ర విసర్జన చేశాడు. అప్పటికి గుటెర్రెజ్ గాఢ నిద్రలో ఉన్నాడు. మెళకువ వచ్చి చూసేసరికి అతడికి ఏం జరుగుతోందో అర్థం కాలేదు. ఇది కలేమో అని క్షణకాలం భ్రమపడ్డాడు. జరిగిన దారుణాన్ని ఆ మరుక్షణమే గుర్తించి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.


Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..

ఈ ఘటనపై ఎయిర్‌లైన్స్ స్పందించిన తీరు దారుణమని బాధితుడి కూతురు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన దుస్తుల్లోనే తన తండ్రి ఎనిమిది గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని సమీపించరాదంటూ తన తండ్రిని ఉన్న సీటులోనే సిబ్బంది కూర్చోబెట్టారని ఆమె తెలిపారు. తన తండ్రి నిందితుడిని సమీపిస్తే విషయం చేయి దాటే ప్రమాదం ఉందని ఇలా చేసుంటారని చెప్పుకొచ్చింది. మూత్రంతో తడిసిన దుస్తుల్లో ప్రయాణించడం ఆరోగ్యపరమైన చిక్కులు తెస్తుందన్న విషయాన్ని కూడా సిబ్బంది పట్టించుకోలేదని ఆమె వాపోయింది. ప్రయాణికుడు ఇబ్బంది పడుతేంటే సిబ్బంది మాత్రం ఎయిర్‌లైన్స్ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని ఆవేదన వ్యక్తం చేసింది.


Viral: దేశసంపదలో 18 శాతం 2 వేల కుటుంబాల చేతుల్లోనే! బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ పోస్టు వైరల్

కాగా, ఘటనపై ఎయిర్‌లైన్స్ సంస్థ కూడా స్పందించింది. ప్రయాణికుడి కారణంగా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనట్టు తెలిపింది. నిందితుడు తమ ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణించకుండా నిషేధం విధించినట్టు పేర్కొంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు కూడా తెలిపింది.

Viral: గ్యాస్ ఏజెన్సీ ఇవ్వాల్సిన రూ.1.5 చిల్లర కోసం 7 ఏళ్ల పాటు పోరాడి గెలిచిన వినియోగదారుడు!

Read Latest and Viral News

Updated Date - Jan 06 , 2025 | 11:04 PM