Share News

Viral News: య్యూటూబ్‌లో చూసి ఆపరేషన్ చేసుకున్నాడు.. ఆ తర్వాత..

ABN , Publish Date - Mar 21 , 2025 | 05:29 PM

YouTube Video: ఏం తెలుసుకోవాలన్నా.. ప్రతి ఒక్కరు య్యూటూబ్‌ను ఆశ్రయిస్తున్నారు. ఎడతెరపి లేకుండా వస్తున్న కడుపు నొప్పితో తీవ్రంగా బాధపడుతోన్న ఓ వ్యక్తి య్యూటూబ్ చూసి ఆపరేషన్ చేసుకున్నాడు. తద్వారా ప్రాణల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే...

Viral News: య్యూటూబ్‌లో చూసి ఆపరేషన్ చేసుకున్నాడు.. ఆ తర్వాత..
RajaBabu Kumar

ప్రస్తుతం ప్రతి ఒక్కరు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. ఆ క్రమంలో యూట్యూబ్‌లో చూసి వంట తయారు చేస్తున్నారు. య్యూటూబ్‌‌లో చూసి ఫ్యాన్ బిగిస్తున్నారు. చివరకు య్యూటూబ్‌లో చూసి హత్యకు ప్లాన్ చేస్తున్నారు. అంతాలా సోషల్ మీడియా ప్రతి ఒక్కరిని తీవ్ర ప్రభావితం చేస్తోంది. అయితే ఓ యువకుడు.. య్యూట్యూబ్‌లో చూసి తనకు తాను ఆపరేషన్ చేసుకున్నాడు. ఆ తర్వాత ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌, మథుర సమీపంలోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. 32 ఏళ్ల రాజాబాబు కుమార్‌కు తరచు కడుపు నొప్పి వస్తోంది.

అది కూడా ఆగ కుండా వస్తుంది. దీంతో కడుపు నొప్పిని తగ్గించుకోనే మార్గం కోసం య్యూటూబ్‌, ఇంటర్నెట్‌లలో సమాచారాన్ని సేకరించాడు. ఆ క్రమంలో బుధవారం సాయంత్రం తన నివాసంలో గది తలుపు వేసుకున్నాడు. అనంతరం య్యూటూబ్‌లో చూస్తూ.. తన కడుపులో నొప్పి పెడుతోన్న పొత్తు కడుపులోని బాగాన్ని బ్లేడుతో కోసుకున్నాడు. దీంతో రక్త స్రావం జరిగింది. ఆ రక్తాన్ని ఆపేందుకు ప్రయత్నించి అతడు విఫలమయ్యారు. బ్లేడ్‌తో కోసిన బాగాన్ని కుట్లు వేశాడు.


కానీ రక్తస్రావం మాత్రం ఆగలేదు. ఈ విషయాన్ని అతడు వెంటనే తన కుటుంబ సభ్యులకు తెలియజేశాడు. వారు వెంటనే.. మథురలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి రాజాబాబు కుమార్‌ను హుటాహుటిన తరలించారు. అనంతరం అతడిని ఆగ్రాలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.


ఈ ఘటనపై మథుర జిల్లా ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శశి రాజన్ మాట్లాడుతూ.. రాజాబాబు కుమార్.. తన పొత్తి కడుపు కుడి వైపు భాగాన్ని బ్లేడుతో కోసుకున్నాడని తెలిపారు. అనంతరం ఆ భాగాన్ని దాదాపు 10 నుంచి 12 కుట్లు వేసుకున్నాడని చెప్పారు. అయితే ఆ కుట్లు అతడు సరిగ్గా వేసుకో లేదని.. దీంతో రక్త స్రావం తీవ్రంగా జరిగిందని డాక్టర్ శశి రాజన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆ కుట్లను సరి చేశామన్నారు. అనంతరం అతడికి మరింత మెరుగైన వైద్య సహయం కోసం ఆగ్రా ఆసుపత్రికి తరలించామని డాక్టర్ శశిరాజన్ వెల్లడించారు.


రోజు నిత్యం ఈ తరహా వార్తలు అటు మీడియాలో ఇటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ జనం మాత్రం వీటినే వీక్షించి ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దేనినైనా ఎంత వరకు తీసుకోవాలో.. అంత వరకే తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ఏదైనా పెరుగుట విరుగుట కొరకేనని వారు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..


PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..


Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

For Viral News And Telugu News

Updated Date - Mar 21 , 2025 | 06:18 PM