Share News

Viral: సోషల్ మీడియాలో ఎలాగైనా వైరల్ అవ్వాలని.. యువకుడి షాకింగ్ వీడియో వైరల్

ABN , Publish Date - Jan 21 , 2025 | 09:04 PM

సోషల్ మీడియాలో ఫాలోవర్లు పెంచుకునేందుకు ప్రాంక్ వీడియోకు ట్రై చేసిన ఓ యువకుడు ఊహించని ప్రమాదంలో పడ్డాడు. సూపర్‌ గ్లూతో పెదాలను అంటుపెట్టున్నాక అవి మళ్లీ తెరుచుకోకపోవడంతో కంగారులో పరుగులు తీశాడు. ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Viral: సోషల్ మీడియాలో ఎలాగైనా వైరల్ అవ్వాలని.. యువకుడి షాకింగ్ వీడియో వైరల్

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు అసాధారణ ప్రయత్నాలకు దిగితే ప్రమాదం తప్పదు. ఇది తెలిసినా కొందరు తమని తాము నియంత్రించుకోలేరు. ఎలాగైనా నెటిజన్ల దృష్టిలో పడాలనే తపనతో కొత్త కొత్త స్టంట్లు చేస్తూ సమస్యల్లో చిక్కుకుంటారు. అలాంటి ఓ యువకుడి వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. వీడియోలో యువకుడి ప్రయత్నా్న్ని చూసి షాకైపోతున్న జనాలు.. ఇదేం దారుణం దేవుడా అంటూ కామెంట్స్ పెడుతున్నారు (Viral).

ఫిలిప్పీన్స్‌లో జరిగిన ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం ఇన్‌స్టాలో తెగ వైరల్ అవుతోంది. బాడిస్ టీవీ అనే అకౌంట్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఇందులో ఓ యువకుడు సూపర్ గ్లూతో తన పెదాలు అతికించుకునే ప్రయత్నం చేసి చివరకు ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాడు.


Viral: ట్రంప్ ప్రమాణస్వీకారం.. జో బైడెన్ రియాక్షన్ వైరల్

తొలుత అతడు తన పెదాలపై గమ్ము రాసుకుని గట్టిగా పెదాలను అదిమిపెట్టాడు. అతడు ఊహించినట్టు పెదాలు అత్కుకుపోయాయి. తన ప్రయత్నం ఫలించినందుకు అతడికి తొలుత నవ్వొచ్చింది. కానీ పెదాలు మూసి ఉండటంతో నవ్వలేకపోయాడు. అయితే, తానెంత ప్రమాదంలో ఉన్నదీ ఆ తరువాత అతడికి తెలిసి దుఃఖం తన్నుకొచ్చింది. నవ్వడం ఆపాక అతడు తొలుత నోరు తెరిచేందుకు ప్రయత్నించాడు. కానీ పెదవులు అతుక్కునే ఉండటంతో అది సాధ్యపడలేదు. ఆ తరువాత మరోసారి ప్రయత్నించాడు. అయినా ఉపయోగం లేకపోయింది.

తన పెదాలు గట్టిగా అతుక్కుని పోయినట్టు అతడికి క్షణాలు గడుస్తున్న కొద్దీ స్పష్టమైంది. దీంతో, నవ్వు స్థానంలో ఆందోళన వచ్చి చేరింది. గట్టిగా అరుద్దామనుకున్నా అతడి నోరు తెరుచుకోలేదు. దీంతో, అతడు తెగ గాబరా పడిపోయాడు. కూర్చొన్న చోట నుంచి ఒక్క ఉదుటన లేచి హడావుడిగా ఎక్కడకో బయలుదేరాడు. అయితే, అక్కడితో మీడియో ముగిసిపోవడంతో ఆ తరువాత ఏం జరిగిందీ తెలియరాలేదు.


Viral: మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.. వారానికి 70 పని గంటలపై ఇన్ఫీ నారాయణమూర్తి కీలక వ్యాఖ్య

ఇక వీడియో చూసిన జనాల్లో కొందరు పడీ పడీ నవ్వుతుంటే కొందరు మాత్రం యువకుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. వైరల్ అవ్వాలని, జనాలను ఎంటర్‌టైన్ చేయాలనే తపనలో ఏం చేస్తోందీ గుర్తించలేకపోతే ఎలా అంటూ గడ్డిపెట్టారు. ఈ సమస్యకు డాక్టర్‌ మాత్రమే పరిష్కారం చూపించగలరని కొందరు అన్నారు. అతడికి జీవితంలో మర్చిపోలేని గుణపాఠం వచ్చిందని కొందరు కామెంట చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య వీడియో తెగ వైరల్ అవుతోంది.

Read Latest and Viral News

Updated Date - Jan 21 , 2025 | 09:06 PM