Share News

Tuna: మోటర్‌సైకిల్ సైజులో ఉన్న చేప వేలం.. ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిన వైనం

ABN , Publish Date - Jan 07 , 2025 | 10:25 PM

జపాన్‌లో సంప్రదాయంగా వస్తున్న నూతన సంవత్సర ట్యూనా చేపల వేలంలో ఈసారి బ్లూఫిన్ ట్యూనా చేప ఏకంగా రూ.11 కోట్లు అమ్ముడుపోయింది.

Tuna: మోటర్‌సైకిల్ సైజులో ఉన్న చేప వేలం.. ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిన వైనం

ఇంటర్నెట్ డెస్క్: ఒక చేప ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిందంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. చేప అంత ఖరీదు ఎందుకు పలికిందనే సందేహం కూడా కలుగుతుంది. అయితే, ఓ సంప్రదాయం కారణంగా చేపల వేలంలో పెద్ద ఎత్తున పాల్గొనే ప్రముఖులు పెద్ద చేపలను ఎంత ఖరీదు పెట్టైనా కొనేందుకు వెనకాడదరు. అందుకే అక్కడ సంవత్సరం తొలి రోజన చేపల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఇంతకీ ఎక్కడ ఇదంతా అంటారా? ఇదంతా జపాన్‌లో ప్రతి ఏటా ప్రారంభంలో కనిపించే దృశ్యం (Viral).

జపాన్‌లో టోయోసూ చేపల మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్. ఏటా తొలి రోజున అక్కడికి రెస్టారెంట్ యజమానులు క్యూ కడుతుంటారు. అక్కడ వేలం వేసే తొలి ట్యూనా చేపను చేజిక్కించుకునేందుకు ఎంత డబ్బు చెల్లించేందుకైనా సిద్ధపడతారు. జపాన్ సంప్రదాయం ప్రకారం, ఈ తొలి చేపను సొంతం చేసుకున్న వారికి సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయట. అందుకే ప్రముఖ రెస్టారెంట్ల యజమానులు నూతన సంవత్సరం నాడు ఇక్కడికి క్యూ కడుతుంటారు.


Viral: ఏఐ సాయంతో 19 ఏళ్ల మర్డర్ మిస్టరినీ ఛేదించిన కేరళ పోలీసులు

ఈసారి తొలి ట్యూనాను ఓనోడేరా గ్రూప్ చేజిక్కించుకుంది. దాదాపు 276 కిలోగ్రాముల బరువున్న ఈ చేపను 207 మిలియన్ల యెన్‌లు చెల్లించి సొంతం చేసుకుంది. 1999 తరువాత రెండో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ట్యూనా ఇదే. అయితే, 2023లో కూడా తొలి ట్యూనాకు ఇదే సంస్థ సొంతం చేసుకుంది. కానీ నాటి వేలంతో పోలిస్తే ఈసారి 114 మిలియన్ యెన్లు అధికంగా చెల్లించాల్సి వచ్చింది.

అయితే, ఓ ట్యూనా అత్యధిక రేటుకు అమ్ముడు పోయిన రికార్డు మాత్రం 2019లో నమోదైంది. అప్పట్లో ట్యూనా కింగ్‌గా పేరుపడ్డ ప్రముఖ వ్యాపారవేత్త కియోషీ కుమురా ఏకంగా 336.6 మిలియన్ యెన్‌లు పెట్టి 278 కేజీల బరువుతున్న ట్యూనాను సొంతం చేసుకున్నారు.


Viral: ఇంట్లో ఒంటరిగా 38 ఏళ్ల మహిళ! చోరీకొచ్చిన దొంగ ఊహించని విధంగా..

కొవిడ్ కారణంగా ఈ హడావుడి కొంత తగ్గినా ఈ మధ్య కాలంలో మళ్లీ ప్రముఖ రెస్టారెంట్ల యజమానులు ట్యూనా వేలంలో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే, ట్యూనాల ధరలు గతంలో పోలిస్తే కాస్త తక్కువగా ఉన్నాయని అక్కడి వారు చెబుతున్నారు. అయితే, ఈసారి కూడా ట్యూనాలకు అధికధరలు పలకడంపై అనేక మంది హర్షం వ్యక్తం చేశారు.

Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..

Read Latest and Viral News

Updated Date - Jan 07 , 2025 | 10:55 PM