Share News

Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో

ABN , Publish Date - Jan 19 , 2025 | 07:42 PM

మనుషుల కంటే మిన్నగా ఓ కోతి పతంగి ఎగరేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. వాస్తవానికి ఇది పాత వీడియోనే అయినా సంక్రాంతి పండుగ సందర్భంగా మరోమారు తెరపైకి వచ్చింది.

Viral: వామ్మో.. ఈ కోతి గాలిపటం ఎగరేయడం ఎక్కడ నేర్చుకుందో.. షాకింగ్ వీడియో

ఇంటర్నెట్ డెస్క్: సంక్రాంతి నాడు యావత్ దేశం పతంగులు ఎగరేస్తూ ఫుల్లుగా ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ సందర్భంగా ఓ అసాధారణ ఘటన తాలూు వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీన్ని చూసి జనాలు షాకైపోతున్నారు. వీడియోలోని కోతి చేష్టలు చూశాక.. దీనికి ఇంత నేర్పు ఎలా వచ్చిందో అంటూ షాకైపోతున్నారు (Viral).

వీడియోలో కనిపించిన దాని ప్రకారం, దూరంగా ఉన్న భవంతిపై కూర్చున్న ఓ కోతి సునాయసంగా పతంగి ఎగరేయడం కొందరిని ఆకర్షించింది. ఆ దృశ్యాల్ని వారు కెమెరాలో బంధించి నెట్టింట పంచుకోవడంతో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. భవనం పైకెక్కి కూర్చున్న సదరు కోతికి ఎలా దొరికిందో కానీ ఓ పతంగి దారం దొరికింది. దాని సాయంతో అది అచ్చు మనుషుల్లాగే పతంగిని కిందకు దింపే ప్రయత్నం చేసింది. మొదట కాస్త తడబడ్డా ఆ తరువాత తేరుకుని పతంగిని తనకు అందే ఎత్తుకు తీసుకొచ్చి ఆ తరువాత దాన్ని గాల్లో జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసింది. వెనకున్న భవంతిపై ఉన్న కొందరు ఇదంతా చూసి షాకైపోతూ ఈలలు వేస్తూ కేకలు పెడుతూ గోలగోల చేశారు.


Viral: బిడ్డను కన్నందుకు పరిహారంగా భార్యకు ‘మహిళా పన్ను’ చెల్లింపు! ఇదేం తీరు దేవుడా..

అయితే, ఈ వీడియో నాలుగేళ్ల నాటిదని కొందరు నెటిజన్లు చెప్పుకొచ్చారు. తమ వాదనకు రుజువును కూడా జనాల ముందుంచారు. వాస్తవానికి ఈ ఘటన సంబంధించిన వీడియోను తొలిసారి పర్వీన్ కాస్వాన్ అనే ఐఎఫ్ఎస్ అధికారి నాలుగేళ్ల క్రితం ట్విట్టర్‌లో షేర్ చేశారు. కోతి తెలివిగా, నైపుణ్యంగా పతంగి ఎగరేడయం చూసి ఆశ్చర్యపోయారు. మానకళ్ల ముందే జీవ పరిణామక్రమం చోటుచేసుకుంటోందని కామెంట్ చేశారు. అయితే, సంక్రాంతి నేపథ్యంలో ఈ వీడియో మరోసారి నెట్టింట హల్‌చల్ చేయడం ప్రారంభించింది. వీడియో చూసి షాకైపోయిన జనాలు దీన్ని తమకు తెలిసిన వారికి షేర్ చేస్తూ వైరల్ చేసేశారు. ఇండియాలో ఇలాంటి సీన్లు సాధారణమంటూ కామెంట్ చేశారు.


Viral: లండన్‌లో నెలకు రూ.లక్ష ఇంటి అద్దె కడుతున్నా తప్పని ఇక్కట్లు.. ఎన్నారై వీడియో వైరల్

ఇక నిపుణులు చెప్పే దాని ప్రకారం, మనుషులకు చింపాజీలు, గోరిల్లాలే జన్యుపరమైన పోలిక ఎక్కువ. ఈ జాతుల్లోని 98 శాతం డీఎన్‌ఏ ఒకేలా ఉంటుందట. అయితే, కోతులు, మనుషుల మధ్య వ్యత్యాసం అధికమని నిపుణులు చెబుతున్నారు. ఇక కోతులకు మేధో సామర్థ్యం కూడా ఎక్కువే. అవి రకరకాల వస్తువులను తమ అవసరాలకు అనుగూణంగా వాడుకోగలవు. వాటికి స్వీయ ఉనికిని గుర్తించే మెధో సామర్థ్యం కూడా ఉంటుందని నిపుణులు చెబుతారు.

Read Latest and Viral News

Updated Date - Jan 19 , 2025 | 07:43 PM