Share News

Viral: ఇంట్లో ఒంటరిగా 38 ఏళ్ల మహిళ! చోరీకొచ్చిన దొంగ ఊహించని విధంగా..

ABN , Publish Date - Jan 07 , 2025 | 05:03 PM

చోరీకొచ్చిన ఓ దొంగ.. ఇంట్లోని ఒంటరి మహిళకు ముద్దిచ్చి పారిపోయిన ఘటన ముంబైలో వెలుగు చూసింది. ఇంట్లో ఏమీ లేవని మహిళ చెప్పడంతో చివరకు ఆమెను దొంగ ముద్దాడి పారిపోయాడని తెలిసి స్థానికులు షాకైపోతున్నారు.

Viral: ఇంట్లో ఒంటరిగా 38 ఏళ్ల మహిళ! చోరీకొచ్చిన దొంగ ఊహించని విధంగా..

ఇంటర్నెట్ డెస్క్: ఈ మధ్య అసాధారణ దొంగతనాల తాలూకు ఉదంతాలు నిత్యం వెలుగులోకి వస్తున్నాయి. గుళ్లల్లోకి చోరీకొచ్చిన దొంగలు దేవుడికి దండం పెట్టి మరీ నగానట్రా దోచుకుపోయారు. మరికొన్ని సందర్భాల్లో కన్నం వేసిన ఇళ్లల్లోనే ఫుల్లుగా తాగి కునుకు తీశారు. ఇంకొన్ని సందర్భాల్లో ఇంటి యజమానులకు మంచి ఫుడ్ వదిలిపెట్టి కూడా వెళ్లారు. అయితే, వాటన్నిటికీ మించిన ఉదంతం మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది. ఆ దొంగ చేసిన పని తెలిసి జనాలు షాకైపోతున్నారు (Viral)..

స్థానిక మీడియా కథనాల ప్రకారం, ముంబైలోని మలాడ్ ప్రాంతంలో జనవరి 3న ఈ ఘటన జరిగింది. ఆ రోజు రాత్రి 38 ఏళ్ల మహిళ ఒకరు ఇంట్లో ఒంటరిగా ఉండగా ఓ దొంగ బలవంతంగా ఇంట్లోకి దూసుకొచ్చి లోపలి నుంచి గడియపెట్టాడు. ఆమె నోరు తన చేతితో మూసి ఇంట్లో ఉన్న విలువైన వస్తువులన్నీ తనకివ్వాలని డిమాండ్ చేశారు. నగదు, మొబైల్ ఫోన్లు, ఏటీఎమ్ కార్డులు ఇలా అన్నీ ఇచ్చేయాలని బలవంతం చేశాడు.


Viral: డాక్టర్లు కడుపులో సూది వదిలిపెట్టడంతో గర్భస్థ శిశువుకు గాయాలు.. బాధితురాలి సంచలన ఆరోపణలు

దొంగ హల్‌చల్ చూసి భయపడిపోయిన మహిళ తననేం చేయొద్దని ప్రాధేయపడింది. తన ఇంట్లో విలువైన వస్తువులేవీ లేవని కాళ్లావేళ్లాపడింది. ఇది విని దొంగ ఏమనుకున్నాడో తెలీదు కానీ ఆమె చెప్పిందంతా విన్నాక అతడు ఆమెను ముద్దాడి అక్కడి నుంచి పారిపోయాడు. దీంతో, మహిళకు ఏం జరుగుతోందో అర్థంకాక తీవ్ర షాక్‌కు గురైంది.

Viral: విమానంలో తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన.. కలోనిజమో తెలీక బాధితుడికి షాక్!


చివరకు బాధితురాలు స్థానిక కురార్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసుల కేసు నమోదు చేశారు. ఆదే రోజు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, నిందితుడు స్థానికంగానే తన కుటుంబంతో కలిసి ఉంటాడని, అతడికి అంతకుముందు నేర చరిత్ర ఏమీ లేదని కూడా చెప్పారు. ప్రస్తుతం అతడికి ఉద్యోగం లేదని కూడా తెలిపారు. అయితే, అసలు నిందితుడు ఇలా దొంగతనానికి ఎందుకు దిగాడో తెలుసుకునేందుకు లోతైన దర్యాప్తు చేస్తున్నట్టు స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు, దొంగ చేసిన పనికి స్థానికంగా పెను కలకలానికి దారి తీసింది. డబ్బు కోసమే చేశాడా లేదా మరే దురుద్దేశం ఉందా అని తెగ చర్చించుకుంటున్నారు.

Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..

Read Latest and Viral News

Updated Date - Jan 07 , 2025 | 05:03 PM