Share News

Viral Video: ఈమె తెలివితో గీజర్ కంపెనీలకే షాక్.. కరెంట్ అవసరం లేకుండా నీటిని ఎలా వేడి చేస్తోందో చూడండి..

ABN , Publish Date - Jan 04 , 2025 | 04:01 PM

చలికాలంలో చాలా మంది స్నానం చేయడం కోసం గీజర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే గీజర్లు కొనుక్కోవడం అందరికీ కుదరదు. అలాంటి వారి కోసం ఓ మహిళ అద్భుతమైన ఉపాయం సూచిస్తోంది. అది చూస్తే ఆమె తెలివి ముందు గీజర్లు కూడా వృథా అనిపిస్తాయి. కరెంట్ లేకుండా చాలా సులభంగా ఆమె నీటిని వేడి చేస్తోంది.

Viral Video: ఈమె తెలివితో గీజర్ కంపెనీలకే షాక్.. కరెంట్ అవసరం లేకుండా నీటిని ఎలా వేడి చేస్తోందో చూడండి..
Desi jugaad video

ప్రస్తుతం దేశాన్ని చలి (Winter) వణికిస్తోంది. ముఖ్యంగా ఉత్తరాదిన చలి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో అందరూ బయటకు వచ్చేటపుడు స్వెట్టర్లు వేసుకుంటారు. అలాగే స్నానం చేయడం కోసం గీజర్ల (Geysers)ను ఆశ్రయిస్తున్నారు. అయితే గీజర్లు కొనుక్కోవడం అందరికీ కుదరదు. అలాంటి వారి కోసం ఓ మహిళ అద్భుతమైన ఉపాయం సూచిస్తోంది (Desi Jugaad). అది చూస్తే ఆమె తెలివి ముందు గీజర్లు కూడా వృథా అనిపిస్తాయి. కరెంట్ లేకుండా చాలా సులభంగా ఆమె నీటిని వేడి చేస్తోంది (Hot Water). ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


aggnesgaming11 అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఆమె కేవలం ఓ పాత్ర ద్వారా కరెంట్ అవసరం లేకుండా నీటిని వేడి చేసేస్తోంది. ముందుగా పాత్రలో కొన్ని కర్ర ముక్కలు వేసి వాటిని మండిస్తోంది. ఆ పాత్రకు ఓ స్టీల్ పైప్‌ను బిగించింది. ఆ మంట కారణంగా ఆ పాత్రతో పాటు ఆ పైప్ కూడా వేడెక్కుతోంది. ఆ సమయంలో ఆ పైప్‌లో ఒకవైపు నుంచి చల్లని నీటిని వేస్తుంటే మరో వైపు నుంచి వేడి నీరు బయటకు వచ్చేస్తోంది. అది చూస్తున్న వారందరూ షాకయ్యారు. ఓ వ్యక్తి ఆ జుగాడ్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


ఆ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు కోటి మందికి పైగా వీక్షించారు. 8.4 లక్షల కంటే ఎక్కువ మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు తమ స్పందనలను తెలియజేశారు. ``ఇది చాలా చక్కగా పని చేస్తుంది. కానీ, దీనిని పూర్వీకులు కనిపెట్టారు``, ``అద్భుతమైన దేశీ జుగాడ్``, ``రోజూ కర్ర ముక్కలు వెతుక్కోవడం చాలా కష్టం`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఎంతటి గజదొంగ అయినా షాకవ్వాల్సిందే.. ఈ ఇంటికి తాళం ఎలా వేశారో చూడండి..


Viral Video: హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా తగ్గేదే లే.. ఈ బామ్మ తీరు చూస్తే నవ్వాపుకోలేం..


Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..


Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..


Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 04 , 2025 | 04:42 PM