Viral Video: ఎంతటి గజదొంగ అయినా షాకవ్వాల్సిందే.. ఈ ఇంటికి తాళం ఎలా వేశారో చూడండి..
ABN , Publish Date - Jan 02 , 2025 | 08:01 PM
సాధారణంగా ఇంట్లో దొంగలు పడకుండా ఒక్కొక్కరు తమకు తోచిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు తప్పకుండా తలుపులకు తాళాలు వేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోలోని వ్యక్తి చాలా వెరైటీగా తాళం వేశాడు. ఆ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక రకరకాల వీడియోలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. వాటిల్లో కొన్ని ఫన్నీ వీడియోలు అందర్నీ ఆకట్టుకుని వైరల్ అవుతున్నాయి. సాధారణంగా ఇంట్లో దొంగలు (Thieves) పడకుండా ఒక్కొక్కరు తమకు తోచిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఎక్కడికైనా బయటకు వెళ్లినపుడు తప్పకుండా తలుపులకు తాళాలు (Lock) వేస్తారు. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫన్నీ వీడియోలోని వ్యక్తి చాలా వెరైటీగా తాళం వేశాడు. ఆ వీడియో చూసిన వారందరూ ఆశ్చర్యపోతున్నారు (Viral Video).
@HasnaZaruriHai అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ ఇంటి తలుపు వేసి ఉంది. దానికి గడియ కూడా పెట్టి ఉంది. అయితే ఆ గడియకు తాళం వేసి లేదు. పక్కన మాత్రం తాళం కప్ప వేసి ఉంది. ఓ వ్యక్తి వెళ్లి గడియ తీయడానికి ప్రయత్నిస్తే సగమే వచ్చింది. పూర్తిగా రాలేదు. గడియ పూర్తిగా బయటకు రావడానికి తాళం కప్ప అడ్డుపడుతోంది. ఓ వ్యక్తి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో చూసిన వారు ఆశ్చర్యపోతున్నారు. తాళం అలా ఎందుకు వేశారో అర్థం చేసుకోలేకపోతున్నారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 7.7 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 4 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ``ఎంతటి గజ దొంగ అయినా ఆ ఇంట్లో చోరీ చేయలేరు``, ``ఇలా కూడా తాళం వేయవచ్చా``, ``ఇతను దొంగలకే దొంగలా ఉన్నాడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: హాస్పిటల్ బెడ్ మీద ఉన్నా తగ్గేదే లే.. ఈ బామ్మ తీరు చూస్తే నవ్వాపుకోలేం..
Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..
Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..
Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి