Share News

Viral Video: గూగుల్ మ్యాప్స్‌కే షాకిచ్చాడుగా.. కుంభమేళాలో ఓ వ్యక్తి విచిత్ర ఆలోచన.. నెటిజన్లు ఫిదా..

ABN , Publish Date - Feb 04 , 2025 | 11:36 AM

ప్రస్తుతం మనం ఎవరినైనా చేరుకోవాలంటే గూగల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. మొబైల్‌లోని ఆ మ్యాప్స్ ఆధారంగా ఎవరినైనా కలవడం సులభంగా మారుతోంది. అయితే పెద్ద వయసున్న వారి దగ్గర మొబైల్స్ ఉండవు. ఉన్నా వారికి గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో కావడం కష్టం.

Viral Video: గూగుల్ మ్యాప్స్‌కే షాకిచ్చాడుగా.. కుంభమేళాలో ఓ వ్యక్తి విచిత్ర ఆలోచన.. నెటిజన్లు ఫిదా..
Oldest google maps in Maha Kumbh

ప్రస్తుత ఆధునిక యుగంలో తెలియని ప్రదేశానికి వెళ్లాలంటే అందరూ గూగుల్ మ్యాప్స్‌ను (Google Maps) ఉపయోగిస్తున్నారు. మనం ఎవరినైనా చేరుకోవాలన్నా గూగల్ మ్యాప్స్ ద్వారా లొకేషన్ షేర్ చేస్తున్నారు. మొబైల్‌లోని ఆ మ్యాప్స్ ఆధారంగా ఎవరినైనా కలవడం సులభంగా మారుతోంది. అయితే పెద్ద వయసున్న వారి దగ్గర మొబైల్స్ ఉండవు. ఉన్నా వారికి గూగుల్ మ్యాప్స్‌ను ఫాలో కావడం కష్టం. ముఖ్యంగా కోట్ల మంది హాజరయ్యే కుంభమేళా (Maha Kumbh) వంటి ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరైనపుడు తప్పి పోయే సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో తిరిగి మన వారిని కలుసుకోవడం ఎలా? దీనికి ఓ వ్యక్తి అద్భుతమైన పరిష్కారం (Jugaad) కనుగొన్నాడు (Viral Video).


కుంభమేళాలో ఓ వ్యక్తి తన తెలివితేటలతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. @swatic12 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఆ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్‌రాజ్‌లో ఓ వ్యక్తి పెద్ద కర్రకు ఎర్రటి జెండాలాంటిది తగిలించి దానిని పైకి ఎత్తి నడుస్తున్నాడు. అలా ఎందుకు చేస్తున్నారని ఓ వ్యక్తి ప్రశ్నించగా అతడు షాకింగ్ సమాధానం చెప్పాడు. తాము మొత్తం 25 మంది పుణ్య స్నానం కోసం ప్రయాగరాజ్ వచ్చామని, ఇంత మంది జనంలో తమ వారు ఎవరైనా తప్పిపోతే ఈ జెండా చూసి తమ వద్దకు వచ్చేందుకు ఇలా ప్లాన్ చేశామని చెప్పాడు.


``1970లలో జీపీఎస్ లోకేషన్‌ను కనిపెట్టారు. అంతకు ముందు తప్పిపోయిన వారి కోసం ఇలాంటి ట్రిక్స్‌నే వాడేవారు`` అంటూ ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు 2.6 లక్షల కంటే ఎక్కువ మంది వీక్షించారు. 5.6 వేల మందికి పైగా ఆ వీడియోను లైక్ చేశారు. ఇది అద్భుతమైన ఆలోచన అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.


ఇవి కూడా చదవండి..

Kerala Anganwadis: బిర్యానీ, చికెన్ ఫ్రై కావాలి.. చిన్నారి కోరిక.. కేరళ అంగన్వాడీ మెనూపై రివ్యూ..


Viral Business idea: బిజినెస్ ఐడియా అంటే ఇలా ఉండాలి.. కొన్ని రోజుల్లో అంబానీని దాటేస్తాడేమో..


Optical Illusion: ఈ అడవిలో పాము ఎక్కడుంది.. మీ దృష్టి షార్ప్ అయితేనే 6 సెకెన్లలో కనిపెట్టగలరు..


Spider rain in Brazil: ఆకాశం నుంచి సాలెపురుగల వర్షం.. బ్రెజిల్‌లో వింత ఘటన.. కారణం ఏంటో తెలిస్తే..


Viral Video: తలుపు తెరవగానే మృత్యు దేవత.. వీడియో చూస్తే భయంతో వణికిపోవాల్సిందే..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 04 , 2025 | 11:36 AM