Viral: భారతీయ గురువు ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్థానీ సివిల్స్‌కు ప్రిపరేషన్!
ABN , Publish Date - Jan 13 , 2025 | 04:34 PM
భారతీయ యూపీఎస్సీ మెంటర్ ఇచ్చిన స్ఫూర్తితో పాకిస్థానీ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడు తాజాగా తన మార్గదర్శికి మెసేజీ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ఇది ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: సివిల్స్ ప్రిపరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఎన్నో కష్టనష్టాలకోర్చీ ముందడుగు వేస్తే కానీ విజయం అందదు. ఈ ప్రయాణంలో విద్యార్థుల మానసికంగా పడే శ్రమ అంతా ఇంతా కాదు. ఈ కష్టాలకు తోడు కొందరు ఆర్థిక ఒడిదుడుకులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా పరిస్థితులకు ఎదురీదే విద్యార్థులకు ప్రస్తుతం నెట్టింట అనేక మంది అండగా నిలుస్తున్నారు. అయితే, భారతీయ సివిల్స్ అభ్యర్థులకు మార్గదర్శిగా ఉంటున్న ఓ వ్యక్తిపై తాజాగా పాకిస్థానీ సివిల్స్ అభ్యర్థి ప్రశంసల వర్షం కురిపించారు. దీంతో, ఈ ఉదంతం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది (Viral).
పాకిస్థానీ సెంట్రల్ సుపీరియర్ సర్వీసెస్‌కు సన్నద్ధమవుతున్న ఓ సోషియాలజీ విద్యార్థి చండీగఢ్‌కు చెందిన సివిల్స్ మెంటార్ శేఖర్ గుప్తాపై తాజాగా ప్రశంసలు కురిపించారు. త్వరలో పాకిస్థానీ సివిల్స్ పరీక్ష రాయబోతున్న అతడు తనను ప్రోత్సహిస్తున్న భారతీయ గురువుకు ధన్యవాదాలు తెలిపారు.
Viral: చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకపోయినా ఇన్ఫోసిస్ ఉద్యోగానికి టెకీ రాజీనామా! కారణం ఏంటంటే...
‘‘మీరు క్షేమంగానే ఉన్నారని తలుస్తున్నా. నాది పాకిస్థాన్. సోషియాలజిస్టును కూడా. మీరు యూపీఎస్‌సీ మెంటార్ అని నాకు తెలుసు. నేను త్వరలో సీఎస్ఎస్ పరీక్షలు రాయబోతున్నారు. ఈ సందర్భంగా మీరు నాకు బెస్ ఆఫ్ లక్ చెబుతారనే ఉద్దేశంతో ఈ మెసేజ్ పెడుతున్నాను’’ అని అతడు వివరించాడు.
‘‘ పాకిస్థానీ సివిల్స్‌లో ఉత్తీర్ణత సాధించేందుకు ఇది నా రెండో ప్రయత్నం. ఈసారి పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యా. కానీ ఏదో తికమక నన్ను వేధిస్తోంది. బాగా కన్‌ఫ్యూజ్ అయిపోతున్నా. అయితే, మీరు చేసే స్ఫూర్తివంతమైన ట్వీట్స్‌ను రోజూ చదువుతుంటా. మీ భావాలు, మాటలు నాలో ఉత్సాహం కొనసాగేలా చేస్తున్నాయి. మీ నుంచి ఎంతో నేర్చుకున్నా.. థ్యాంక్యూ’’ అని పోస్టు పెట్టాడు.
Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..
ఈ సంవాదానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను నేరుగా షేర్ చేసిన ఆయన జ్ఞానానికి దేశ సరిహద్దులు అడ్డంకులుగా మారవని వ్యాఖ్యానించారు. ఇక పోస్టుపై నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. దత్త గొప్ప బోధకుడని, అందుకే ఇతర దేశాల వారి అభిమానాన్ని కూడా చూరగొన్నారని కొందరు కామెంట్ చేశారు. ఇలా రకరకాల కామెంట్స్ మధ్య ఈ ఉదంతం తెగ ట్రెండవుతోంది.
Viral: నన్ను తదేకంగా చూడటం నా భార్యకు ఇష్టమే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ చురక