Share News

Viral Video: వీళ్లు అసలు మనుషులు కాదు.. అడవిలోకి వెళ్లి పులితో ఎలా ప్రవర్తించారో చూడండి..

ABN , Publish Date - Jan 04 , 2025 | 05:05 PM

బోనుల్లో బంధించి ఉన్న క్రూరమృగాలను చూడడం కంటే అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి సఫారీ టూర్లకు వెళ్లేటపుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అడవి జంతువులకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించకుండా ప్రవర్తించాలి.

Viral Video: వీళ్లు అసలు మనుషులు కాదు.. అడవిలోకి వెళ్లి పులితో ఎలా ప్రవర్తించారో చూడండి..
People surround tigress, five cubs

ఇటీవలి కాలంలో చాలా మంది జంగిల్ సఫారీ పేరుతో అటవీ పర్యటనలకు (Safari Tours) వెళుతున్నారు. బోనుల్లో బంధించి ఉన్న క్రూరమృగాలను (Wild Animals) చూడడం కంటే అడవిలో స్వేచ్ఛగా తిరుగుతున్న జంతువులను చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి సఫారీ టూర్లకు వెళ్లేటపుడు చాలా జాగ్రత్తలు పాటించాలి. అడవి జంతువులకు ఎలాంటి ఇబ్బందులూ కలిగించకుండా ప్రవర్తించాలి. అయితే చాలా మంది అలాంటి నిబంధనలను పాటించకుండా వన్య ప్రాణులకు ఆటంకం కలిగిస్తున్నారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Viral Video).


మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ (Nagpur)కు సమీపంలో ఉన్న ఉమ్రద్ పౌనీ కర్హాంద్లా శాంక్చురి (wildlife sanctuary)లో పులులును (Tigers) చూసేందుకు టూరిస్ట్‌లను అనుమతిస్తున్నారు. జిప్సీలు, గైడ్‌ల సహకారంతో చాలా మంది ఆ శాంక్చురీకి వెళుతుంటారు. తాజాగా భారీ సంఖ్యలో పర్యాటకులు ఆ శాంక్చురీకి వెళ్లారు. నాలుగు జిప్సీలలో భారీ సంఖ్యలో టూరిస్ట్‌లు వెళ్లారు. వారికి ఓ పులి, దాని పిల్లలు కనిపించాయి. అయితే పులిని ఆ నాలుగు జిప్సీలు చుట్టుముట్టాయి. ఆ పులులు ముందుకు, వెనక్కి వెళ్లకుండా సరౌండ్ చేశారు. ఆ పులులను వీడియోలు, ఫొటోలు తీసుకున్నారు. ఆ పులులు నడిచి వెళ్లిపోతుంటే వాటిని చాలా దగ్గరగా ఫాలో చేశారు.


ఆ వీడియోలు బయటకు రావడంతో అటవీ అధికారులపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో మహారాష్ట్ర అటవీ శాఖ అధికారులకు అప్రమత్తమయ్యారు. నిబంధనలకు వ్యతిరేకంగా నడుచుకున్న జిప్సీ డ్రైవర్లు, గైడ్‌లకు శిక్ష విధించారు. వారికి వారం పాటు శాంక్చురిలోకి రాకుండా సస్పెండ్ చేశారు. అలాగే జిప్సీ డ్రైవర్లు ఒక్కొక్కరికీ రూ.2,500, గైడ్‌లు ఒక్కొక్కరికీ రూ.450 చొప్పున జరిమానా విధించారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: వావ్.. నేచురల్ బ్యూటీ.. ఈ అమ్మాయిని చూసి నెటిజన్లు ఎందుకు ఫిదా అవుతున్నారంటే..

Viral Video: ఈమె తెలివితో గీజర్ కంపెనీలకే షాక్.. కరెంట్ అవసరం లేకుండా నీటిని ఎలా వేడి చేస్తోందో చూడండి..


Optical Illusion Test: మీ కళ్లకు సరైన టెస్ట్.. ఈ బీరువాలో కాఫీ మగ్ ఎక్కడుందో 7 సెకెన్లలో గుర్తించండి..


Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..


Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..


Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 04 , 2025 | 05:05 PM