Viral Video: వావ్.. నేచురల్ బ్యూటీ.. ఈ అమ్మాయిని చూసి నెటిజన్లు ఎందుకు ఫిదా అవుతున్నారంటే..
ABN , Publish Date - Jan 04 , 2025 | 04:38 PM
కొందరు అమ్మాయిలు తమ అందం గురించి కనీసం పట్టించుకోరు. పేద కుటుంబంలో పుట్టి సహజసిద్ధంగా ఉంటారు. ఆ అమ్మాయిలు ఎంతో కళతో చాలా అందంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం రాజస్థాన్‌కు చెందిన జ్యోతి అనే యువతి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
చాలా మంది అమ్మాయిలు తమ అందం (Beauty) కోసం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి మేకప్ వేసుకుంటారు. అయినా వారి అందం అంత గొప్పగా ఉండదు. మరికొందరు అమ్మాయిలు తమ అందం గురించి కనీసం పట్టించుకోరు. పేద కుటుంబంలో పుట్టి సహజసిద్ధంగా ఉంటారు. ఆ అమ్మాయిలు ఎంతో కళతో చాలా అందంగా కనిపిస్తుంటారు. ప్రస్తుతం రాజస్థాన్ (Rajasthan)కు చెందిన జ్యోతి (Jyothy) అనే యువతి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. ఓ వ్లాగర్ ఆమెతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది (Viral Video).
రాజస్థాన్‌కు వెళ్లిన ఓ వ్లాగర్ అక్కడ గాజులు అమ్ముకుంటున్న జ్యోతి అనే యువతితో మాట్లాడాడు. చాలా సాదాసీదా దుస్తులతో ఉన్న జ్యోతి కనీసం పౌడర్ కూడా రాసుకోలేదు. ఎండలో నడుస్తూ గాజులు అమ్ముకుంటోంది. వ్లాగర్ అడిగిన ప్రశ్నలకు ఆమె నవ్వుతూ జవాబులు చెబుతోంది. తనను ఇప్పటివరకు ఎవరూ అలా వీడియో తీయలేదని అంటోంది. ఆ వ్లాగర్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. చాలా మంది జ్యోతి సహజసిద్ధమైన అందాన్ని, ఆమె నవ్వును, అమాయకత్వాన్ని ప్రశంసిస్తున్నారు.
ఆమె కళ్లు బాగున్నాయని చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. జ్యోతి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడంతో ఆమె స్థానికంగా సెలబ్రెటీగా మారిపోయింది. అక్కడకు వస్తున్న విదేశీ పర్యాటకులు జ్యోతితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. ఆమెను భారతీయ అందానికి ప్రతిరూపంగా చాలా మంది అభివర్ణిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Viral Video: పాపం.. అర్జెంటుగా వెళ్లాలనుకుంది.. చివరకు అనుకోని ఇబ్బందికి గురైంది.. వీడియో వైరల్..
Viral Video: బాబూ.. ఇదేం పని.. ఈ వ్యక్తి రైల్లో ఏం చేస్తున్నాడో చూడండి.. సీట్ కవర్లను చింపేస్తూ..
Optical Illusion Test: పాపం.. ఈమెకు తన భర్త కనబడడం లేదు.. 20 సెకెన్లలో వెతికి పెట్టండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి