Share News

Viral: ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న పోర్టర్

ABN , Publish Date - Jan 04 , 2025 | 10:47 AM

ఉచితంగా అందించాల్సిన వీల్ చైర్ సేవల కోసం ఓ ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు చేసిన పోర్టర్‌కు గట్టి షాక్ తగిలింది. విషయం అధికారులకు తెలియడంతో నిందితుడి బ్యాడ్జీని శ్వాశ్వతంగా రద్దు చేశారు.

Viral: ఉచిత వీల్ చైర్ కోసం ఎన్నారై నుంచి రూ.10 వేలు వసూలు.. ఉపాధి పోగొట్టుకున్న పోర్టర్

ఇంటర్నెట్ డెస్క్: రైల్వే స్టేషన్‌లో వీల్ చైర్ కోసం ఓ ఎన్నారై నుంచి ఏకంగా రూ.10 వేలు వసూలు చేసిన పోర్టర్‌ను రైల్వే అధికారులు తొలగించారు. అతడి పోర్టర్ బ్యాడ్జిని శాశ్వతంగా రద్దు చేశారు. ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన వెలుగు చూసింది (Viral).

గుజరాతీ మూలాలున్న పాయల్ లండన్‌లో ఉంటున్నారు. ఇటీవల ఆమె తన తల్లిదండ్రులు రితేశ్, సంధ్య, భర్త సామ్యుయెల్‌తో కలిసి భారత పర్యటనకు వచ్చారు. డిసెంబర్ 21న ఢిల్లీకి వచ్చిన వారు అక్కడి నుంచి ఆగ్రాకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్‌లో దిగిన ఆమె తండ్రికి వీల్ చైర్ కోసం ప్రయత్నించింది. అయితే, తండ్రికి వీల్ చైర్‌తో పాటు లగేజీ తీసుకెళ్లేందుకు ఓ పోర్టర్ ఏకంగా రూ.10 వేలు అడిగాడు. ప్రయాణికులకు వీల్ చైర్ సర్వీసు ఉచితమని తెలియని మహిళ చివరకు అతడి కోరిన మొత్తం ఇచ్చి స్టేషన్‌ బయటకు వెళ్లింది.

Viral: నిత్య యవ్వనం కోసం కొడుకు రక్తాన్ని ఎక్కించుకుంటున్న మహిళ!


ఆ తరువాత ఆగ్రా టూర్‌ సందర్భంగా పాయల్.. పోర్టర్‌కు ఇచ్చి పది వేల గురించి ఓ ట్యాక్సీ డ్రైవర్‌ అసోసియేషన్ అధ్యక్షుడితో ప్రస్తావించింది. అతడు ఆమె మోసపోయిన విషయాన్ని చెప్పాడు. రైల్వే స్టేషన్‌లో వీల్ చైర్ ఉచితంగానే అందుబాటులో ఉంటుందని వివరించాడు. సామాన్లు తరలించేందుకు కూడా కొద్ది మొత్తంలోనే డబ్బు తీసుకుంటారని తెలిపాడు. దీంతో, షాకైన పాయల్, ఆమె భర్త సామ్యుల్ వెంటనే రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Viral: ప్రపంచంలో అతి భారీ ట్రాఫిక్ జామ్! 100 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు!


వెంటనే రంగంలోకి దిగిన జీఆర్‌పీ పోలీసులు హజ్రత్ రైల్వే స్టేషన్‌కు సమాచారం అందించారు. ఆ తరువాత సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోర్టర్‌ను గుర్తించి అతడి నుంచి రూ.9 వేలను ఎన్నారైలకు ఇప్పించారు.

మరోవైపు, ఘటనపై స్పందించిన నార్తర్న్ రైల్వే సదరు పోర్టర్‌పై క్రమశిక్షణ చర్యలకు దిగింది. అతడి పోర్టర్ బ్యాడ్జీని శాశ్వతంగా తొలగించింది. ఘటనపై విచారం వ్యక్తం చేసిన అధికారులు ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు కల్పించేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనతో రైల్వే ప్రతిష్ఠ మసకబారే అవకాశం ఉందని అన్నారు. ఇలాంటి చర్యలను అస్సలు సహించబోమని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్

Read Latest and Viral News

Updated Date - Jan 04 , 2025 | 11:01 AM