Share News

Swami Vivekananda: వేలిముద్రలతో వివేకానందుడి చిత్రపటం

ABN , Publish Date - Jan 14 , 2025 | 01:50 PM

విరుదునగర్‌లో పాఠశాల విద్యార్థులు జాతీయ పతాకం రంగుల్లో బొటన వేలిముద్రతో స్వామి వివేకానంద చిత్రపటం రూపొందించి రికార్డు సాధించారు. స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతి (జూన్‌ 12వ తేది) యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు.

Swami Vivekananda: వేలిముద్రలతో వివేకానందుడి చిత్రపటం

చెన్నై: విరుదునగర్‌లో పాఠశాల విద్యార్థులు జాతీయ పతాకం రంగుల్లో బొటన వేలిముద్రతో స్వామి వివేకానంద చిత్రపటం రూపొందించి రికార్డు సాధించారు. స్వామి వివేకానంద(Swami Vivekananda) జయంతి (జూన్‌ 12వ తేది) యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా విరుదునగర్‌ క్షత్రియ బాలికల మహోన్నత పాఠశాలల విద్యార్థినులు పాఠశాల ప్రాంగణంలో 635 చ.అ విస్తీర్ణంలో వివేకానందుడి చిత్రపటాన్ని బొటన వేలిముద్రలతో మూడు రంగుల్లో చిత్రీకరించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు.

ఈ వార్తను కూడా చదవండి: గంజాయి మత్తులో యువత.. స్పృహలేని స్థితిలో దారుణాలు


nani6.2.jpg

ఇందుకోసం 8,9 తరగతులకు చెందిన 400 మంది విద్యార్థులు తన బొటన వేళ్లపై అక్రలిక్‌ రంగుల్లో ముంచి తెల్లటి ఫలకంపై జాతీయ జెండా రంగులు వేశారు. దాని మధ్యలో అశోక చక్రం ఉన్న చోట స్వామి వివేకానం చిత్రపటాన్ని అదే రంగుల్లో వేసి ప్రపంచ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా సుమారు లక్షకు పైగా వేలిముద్రలతో విద్యార్థులు ఈ చిత్రం రూపొందించారు.


ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి

ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ

ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత

ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 14 , 2025 | 01:50 PM