Share News

Viral: వామ్మో.. బీర్ తాగుతూ బిడ్డకు స్తన్యమిచ్చిన తల్లి.. అసలు ఇలా ఎవరైనా చేస్తారా?

ABN , Publish Date - Jan 03 , 2025 | 02:41 PM

ఓ మహిళ తాను బీర్ తాగుతూనే బిడ్డకు స్తన్యం ఇస్తున్న వైనం తాలుకు ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో సంచలనంగా మారింది. ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Viral: వామ్మో.. బీర్ తాగుతూ బిడ్డకు స్తన్యమిచ్చిన తల్లి.. అసలు ఇలా ఎవరైనా చేస్తారా?

ఇంటర్నెట్ డెస్క్: స్వయంగా సైకాలజిస్టు అయ్యండి కూడా ఓ మహిళ చేసిన పని నెట్టింట ప్రస్తుతం సంచలనంగా మారింది. కొందరు ఆమె తీరును సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తు్న్నారు. తాను బీర్ తాగుతూ బిడ్డకు స్తన్యమివ్వడం చూసి ఇదేం పద్ధతి అంటూ తిట్టిపోస్తున్నారు (Viral).

లింక్డ్‌ఇన్ లూనటిక్స్ అనే రెడిట్ కమ్యూనిటీలో ఈ ఫొటో ప్రస్తుతం సంచలనంగా మారింది. ఓల్గా వ్లచిన్కా అనే మహిళ తాను థాయ్‌లాండ్ 12 ఏళ్ల క్రితం తీసుకున్న వీడియోను నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని తాజాగా షేర్ చేసింది. ఈ ఏడాది తన తీర్మానాలను కూడా వెల్లడించింది. ఈ ఏడాది ఓ కొత్త పుస్తకం రాయబోతున్నానని, దాదాపు 12 ఏళ్ల తొలిసారిగా ఒంటరిగా విహారయాత్రకు వెళ్లేందుకు ప్లాన్ చేసినట్టు కూడా తెలిపింది. ఇన్నాళ్లు తాను ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండలేదని చెప్పుకొచ్చింది. ‘‘సంతానాన్ని కనే దశ దాటిపోయింది. ఇన్నాళ్ల తరువాత కావాల్సిన స్వేచ్ఛ దొరికింది’’ అని సరదా వ్యాఖ్య చేసింది.


Viral: వర్క్ ఫ్రం ఆఫీస్ ఇష్టమంటున్నాడు! ఇతడితో డేటింగ్‌కు ఓకే చెప్పొచ్చా? యువతి ప్రశ్న వైరల్

కాగా, మహిళ చేసిన వీడియోపై జనాలు షాకైపోతున్నారు. కొందరు ఆమె పనిని సమర్థించినా మరికొందరు మాత్రం ఇలాంటి ఫొటోలను నెట్టింట షేర్ చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘మద్యం పానం అలవాటున్న వారు బిడ్డకు స్తన్యమిచ్చేటప్పుడే బీర్ లాంటివి తాగడం మంచిది. ఎందుకంటే.. రక్తంలోని మద్యం పాలల్లో చేరేందుకు కొంత సమయం పడుతుంది. అయితే, ఇలాంటివి బహిరంగంగా షేర్ చేయకపోవడమే మంచిది’’ అని ఓ వ్యక్తి అన్నారు.


Viral: నీళ్లల్లోకి దిగిన సింహం! వెనక నుంచి దాడి చేసిన మొసలి! చివరకు..

‘‘పిల్లలు లేని వాళ్లకు ఈ విషయం తెలీకపోవచ్చు కానీ ఆమె చేస్తోంది ప్రామాణిక పద్ధతే. కానీ ఇలాంటి ఫొటోలు నెట్టింట పంచుకోవడం మాత్రం కచ్చితంగా మూర్ఖత్వమే’’ అని అన్నారు. మరికొందరు మాత్రం ఈ తీరుతో బిడ్డకు హాని కలుగుతుందని హెచ్చరించారు. స్వయంగా సైకాలజిస్టు అయ్యుండి ఇలా చేయొచ్చా అని ప్రశ్నించారు.

Viral: కాటరాక్ట్ ఆపరేషన్ కోసం వచ్చిన మహిళ కంట్లో ఏకంగా 27 కాంటాక్ట్ లెన్సులు! వైద్యులకే భారీ షాక్

Read Latest and Viral News

Updated Date - Jan 03 , 2025 | 02:49 PM