Viral: చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకపోయినా ఇన్ఫోసిస్ ఉద్యోగానికి టెకీ రాజీనామా! కారణం ఏంటంటే...
ABN , Publish Date - Jan 12 , 2025 | 11:14 PM
ఇన్ఫోసిస్‌లో తనకు గుర్తింపు దక్కలేదంటూ ఓ టెకీ రాజీనామా చేశారు. చేతిలో మరో ఆఫర్ లేకపోయినా ఆత్మగౌరవం కోసం సంస్థను వీడానంటూ అతడు పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: చేతిలో మరో జాబ్ ఆఫర్ లేకుండానే ఇన్ఫోసిస్‌లో చేస్తున్న ఉద్యోగానికి గుడ్‌బై చెప్పేశానంటూ ఓ టెకీ పెట్టిన పోస్టు ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. నెట్టింట పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. తన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదంటూ భూపేంద్ర విశ్వకర్మ తన ఆవేదనను నెట్టింట పంచుకున్నాడు. కంపెనీలో వ్యవస్థాగత లోపాలు కొన్నాయని, ఇవి పెద్ద సమస్యలకు సూచికలని చెప్పుకొచ్చారు (Viral).
‘‘సిస్టమ్ ఇంజినీర్ నుంచి సీనియర్ సిస్టమ్ ఇంజినీర్‌గా ప్రమోషన్ వినడానికి బానే ఉంటుంది. కానీ ఆ మేరకు శాలరీ పెరగకపోతే ఈ ప్రమోషన్ నిరర్థకం’’ అని విశ్వకర్మ ఆవేదన వ్యక్తం చేశారు.
టీంలో ఉద్యోగుల సంఖ్య తగ్గినా మిగతా వారు అదనపు పని భారాన్ని భరించాల్సి వచ్చిందని అన్నారు. కొత్త వారిని తీసుకునే బదులు సంస్థ యాజమాన్యం మిగిలిన వారిపైనే భారం మోపిందని అన్నారు. నష్టాలు వస్తున్న ప్రాజెక్టుకు తనను బదలీ చేశారని వాపోయారు. ఇది తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం పడిన విషయాన్ని మేనేజర్ స్వయంగా అంగీరించారని చెప్పుకొచ్చారు.
Viral: పసిబిడ్డతో విమాన ప్రయాణం! టేకాఫ్‌లో జాప్యం జరగడంతో..
క్లైంట్స్ కూడా అలివిమాలిన డిమాండ్స్‌తో భరింపలేని వాతావరణాన్ని సృష్టించారని అన్నారు. వ్యక్తిగత జీవితానికి సమయమే లేకుండా నిత్యం ఏదో సమస్యను పరిష్కరించడంతోనే కాలమంతా గడిచిపోయేదని చెప్పుకొచ్చారు. తాను ఎంత కష్టపడ్డా, సాటి కొలీగ్స్ నుంచి ఎంత గుర్తింపు తెచ్చుకున్నా మేనేజ్‌మెంట్ మాత్రం తన కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వలేదని అన్నారు. శాలరీ మాత్రం పెరగలేదని వాపోయారు.
Viral: నన్ను తదేకంగా చూడటం నా భార్యకు ఇష్టమే.. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ చురక
ఆన్‌సైట్ అవకాశాల్లో ప్రాంతీయ వివక్ష కనిపించిందని విశ్వకర్మ ఆవేదన వ్యక్తం చేశారు. దక్షిణాది భాషలు మాట్లాడే వారికి తరచూ అవకాశాలు వచ్చేవని, హిందీ మాట్లాడే వారిని మాత్రం పట్టించుకునే వారు కాదని అన్నారు. ఇది నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని చెప్పుకొచ్చారు. ఈ పరిస్థితుల్లో తాను తన ఆత్మగౌరవాన్ని, మానసిక ఆరోగ్యాన్ని వదులుకునే ఇష్టం లేక మరో జాబ్ ఆఫర్ లేకపోయినా సంస్థలు వీడాల్సి వచ్చిందని అన్నారు. కొందరు ఆయన పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం రాజీనామా చేయాల్సింది కాదని అన్నారు. ఇది అనేక మంది ఎదుర్కొటున్న పరిస్థితి అని, ఇన్ఫోసిస్‌లో చాలా మందిరి శాలరీ పెంపు వాయిదా పడిందని చెప్పుకొచ్చారు.