Viral: వేటగాళ్ల నుంచి కాపాడేందుకు ఖడ్గమృగం కొమ్ము తొలగింపు.. షాకింగ్ వీడియో
ABN , Publish Date - Jan 02 , 2025 | 08:07 AM
వేటగాళ్ల నుంచి ఖడ్గ మృగాన్ని కాపాడేందుకు దాని కొమ్మును తొలగిస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. మనుషులు చేసే పాపాలకు జంతువులకు శిక్ష వేయడం కరెక్టేనా అంటూ వీడియోపై జనాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: మానవ ఆవాసాల విస్తరణతో అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గిపోతోంది. అడవి జంతువుల ఉనికి ప్రమాదంలో పడుతోంది. ఇది చాలదన్నట్టు, వేటగాళ్లు కూడా వాటిని పొట్టనపెట్టుకుంటున్నారు. అయితే, వేటగాళ్ల నుంచి ఖడ్గ మృగాలను కాపాడుకునేందుకు ఎన్నో ఏళ్లుగా అనుసరిస్తున్న ఓ విధానంపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ఖడ్గ మృగం కొమ్మును తొలగిస్తున్న వైనాన్ని చూసి జనాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు (Viral)..
ఖడ్గ మృగం కొమ్ములో విశేషణమైన ఔషధ గుణాలున్నాయన్న అపోహ కారణంగా కొందరు వాటిని వేటాడుతుంటారు. వీటిని వేటాడటం, అంతమొందించడం చట్టవ్యతిరేకమే అయినా దొంగలు రెచ్చిపోతూ ఉంటారు. దీన్ని నివారించేందుకు ఖడ్గ మృగాల కొమ్ములను తొలగించడం పరిపాటి. జంతు సంరక్షణ చర్యల్లో భాగంగా ఎన్నో ఏళ్లుగా ఈ టెక్నిక్‌ను అనుసరిస్తున్నారు. ఇందుకు సంబంధించిన చిన్న వీడియోను వెటర్నరీ డాక్టర్ యూజీన్ పెట్జెస్ తాజాగా షేర్ చేశారు.
Viral 8 ఏళ్ల పాటు మనుషులతో సావాసం.. రొట్టెలు చేయడం చేర్చిన కోతి!
ఖడ్గ మృగానికి ఉన్న రెండు కొమ్ములను ఎలా తొలగించేదీ ఈ వీడియోలో వివరించారు. కొమ్ములు తొలగించే ముందు జంతువుకు నొప్పి తెలియకుండా ఉండేందుకు కొమ్మును తొలగిస్తామని తెలిపారు. ఇది శాశ్వత పరిష్కారం కాకపోయినా ఇప్పటివరకూ మంచి ఫలితాలే వచ్చాయని, ఖడ్గ మృగాల సంతతి పెరిగిందని అన్నారు. అయితే, భవిష్యత్తులో జంతు సంరక్షణకు మరింత సుస్థిర విధానాల కోసం ప్రయత్నిస్తామని అన్నారు.
అయితే, నెటిజన్లు మాత్రం ఈ వీడియో చూసి పెదవి విరుస్తున్నారు. మనుషుల పాపాలకు జంతువులకు శిక్ష వేయడం సబబేనా అని ప్రశ్నిస్తున్నారు. ‘‘వీటి కొమ్ములను తొలగించే బదులు అదే రంపంతో వేటగాళ్ల పనిపట్టాలి’’ అని ఓ వ్యక్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘సంరక్షణ పేరిట ఖడ్గ మృగాల స్వీయరక్షణ అవయవాన్ని తొలగించడం ఎంతవరకూ సబబు’’ అని మరో వ్యక్తి ప్రశ్నించారు.
Viral: అమెజాన్‌లో రూ.కోటి జీతంతో జాబ్.. రిజైన్ చేసి మరీ సొంత సంస్థ పెడితే..
సంప్రదాయక చైనా వైద్య విధానాల్లో ఖడ్గ మృగాల కొమ్ములను వాడతారు. దీంతో, క్యా్న్సర్ ఫిట్స్ సహా అనేక రోగాలు నయమవుతాయన్న నమ్మకం ఉంది. ఫలితంగా అక్రమార్కులు ఈ కొమ్ములను తీసుకునేందుకు రైనోసరాస్‌లను వేటాడుతుంటారు. కొందరు స్టేటస్ సింబల్‌గా కూడా వీటిని సేకరిస్తారు.
అయితే, కొమ్ముల తొలగింపు ఖడ్గ మృగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా అధ్యయనాల్లో తేలింది. కొమ్ములు లేనివి తమ మందకు దూరంగా, ఒంటరిగా బతుకుతుంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. వాటి సమాజిక ప్రవర్తపై ప్రతి కూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఇక కెరాటిన్‌తో తయారైన ఈ కొమ్ము ఏడాది కాలంలోనే తిరిగిపెరుగుతుంది.
Viral: పబ్‌లో నూతన సంవత్సర వేడుకలు.. అతిథులకు కండోమ్స్ గిఫ్ట్‌గా పంపి ఆహ్వానాలు!