Viral: వేలంలో రూ.56 లక్షలకు అమ్ముడుపోయిన రూ.100 హజ్ నోటు’
ABN , Publish Date - Jan 07 , 2025 | 10:53 PM
1950ల్లో రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా హజ్ యాత్రికుల కోసం ముద్రించిన రూ.100 హజ్ నోటు లండన్‌లో వేలం పాటలో ఏకంగా రూ.56 లక్షలకు అమ్ముడుపోయింది.
ఇంటర్నెట్ డెస్క్: చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా నిలిచే పురాతన వస్తువులను సొంతం చేసుకోవాలనుకునే వారు మార్కెట్లో కోకొల్లలుగా ఉంటారు. వస్తువులు మొదలు కరెన్సీ నోట్ల వరకూ అన్నింటికీ మంచి డిమాండ్ ఉంటుంది. అయితే, రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఒకప్పుడు ముద్రించిన రూ.100 నోటు తాజాగా వేలం వేస్తే ఏకంగా రూ.56 లక్షలకు అమ్ముడుపోయింది. లండన్‌లో ఈ వేలం నిర్వహించారు (Viral)..
Tuna: మోటర్‌సైకిల్ సైజులో ఉన్న చేప వేలం.. ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయిన వైనం
ఏమిటీ నోటు ప్రత్యేకత
భారత ప్రభుత్వం 1950ల్లో జారీ చేసిన ఈ కరెన్సీ నోటు హజ్ నోట్‌గా ప్రసిద్ధి చెందింది. హెచ్ఏ సిరీస్‌తో విడుదల చేసిన ఈ నోట్లను ప్రత్యేకంగా హజ్ యాత్రికుల కోసం ప్రవేశపెట్టారు. అప్పట్లో గల్ఫ్ దేశాల్లో భారత కరెన్సీ చెల్లుబాటులో ఉండేది. దీంతో, భారత్ నుంచి వెళ్లే హజ్ యాత్రికులు అక్కడి ఖర్చు పెట్టుకునేందుకు వీలుగా రిజర్వ్ బ్యాంకు ఈ నోటును ప్రవేశపెట్టింది. అక్రమ బంగారం కొనుగోళ్లకు అడ్డుకట్ట వేయడం కూడా ఈ నోటు వెనకున్న మరో ప్రధాన ఉద్దేశం.
Viral: ఏఐ సాయంతో 19 ఏళ్ల మర్డర్ మిస్టరినీ ఛేదించిన కేరళ పోలీసులు
నోటు ఫీచర్లు ఇవీ..
ఈ నోటుపై ఉన్న నెంబర్ ముందు హెచ్ఏ అని ముద్రించి ఉంటుంది. ఇతర సాధారణ నోట్లకు భిన్నంగా ఉండేందుకు ఈ సిరీస్‌ను ఎంచుకున్నట్టు సమాచారం. వీటి రంగు కూడా ఇతర భారతీయ కరెన్సీ కంటే భిన్నంగా ఉంటుంది. గల్ఫ్ దేశాలైన యూఏఈ, ఖతర్, బహ్రెయిన్, కువైత్, ఒమాన్‌లలో చెల్లుబాటయ్యే ఈ నోటు భారత్‌లో మాత్రం చెల్లుబాటు కాదు.
1961లో కువైత్ తొలిసారిగా తన సొంత కరెన్సీని అమల్లోకి తెచ్చింది. ఆ తరువాత ఇతర గల్ఫ్ దేశాలు కూడా ఇదే బాట పట్టాయి. దీంతో, 1970 కల్లా రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ నోట్ల జారీని నిలిపివేసింది. కానీ వీటికున్న చారిత్రక సాంస్కృతిక ప్రాముఖ్యత దృష్ట్యా వేలంలో అధిక ధరలకు అమ్ముడుపోతుంటాయి.
Viral: కొడుకు గర్ల్‌ఫ్రెండ్‌పై మనసు పారేసుకున్న తండ్రి! ఆమెను సొంతం చేసుకునేందుకు..